దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారిన పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. హైద‌రాబాద్‌లో CAAపై ఓపెన్ డిబేట్ నిర్వ‌హించిన ముర‌ళీధ‌ర్ రావు ఈ సంద‌ర్భంగా కీల‌క కామెంట్లు చేశారు. దేశంలో ఇప్పుడున్న ప్రజలు భారత దేశ ప్రజలేన‌ని ఆయ‌న తెలిపారు. సీఏఏ తర్వాత కుడా వారు ఈ దేశ ప్రజలుగానే ఉంటార‌న్నారు. `` పాకిస్తాన్ ముస్లిం ప్రజలకు కూడా భారత పౌరసత్వం ఇవ్వాలని, దేశంలో కొద్దిమంది నిరసన వ్యక్తం చేయడం ఎందుకో అర్థం కావడం లేదు. caa అనేది పూర్తిగా రాజ్యాంగ బద్దంగా జరుగుతుంది. కానీ కొద్దిమంది ఇది రాజ్యాంగ విరుద్ధం అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.`అని మండిప‌డ్డారు.

 


ముస్లిం ప్రజలకు ప్రత్యేక దేశం ఉండాలి అని కమ్యూనిస్టు పార్టీ 1940లో తీర్మానం చేసింద‌ని ముర‌ళీధ‌ర్ రావు తెలిపారు. ``మీకు భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటే భారత్‌కు తిరిగిరావొచ్చని పాకిస్థాన్ లో ఉన్న హిందువులకు దేశ విభజన సమయంలో మహాత్మాగాంధీ చాలా స్పష్టంగా చెప్పారు. అభయం ఇచ్చాడు. ఆ మేర‌కే సీఏఏ అమ‌లు. మా పార్టీ అధ్యక్షుడు మేం NRCకి సపోర్ట్ అని చాలా స్పష్టంగా చెప్పారు. అయితే, దాన్ని ఎలా అమ‌లు చేయాలి అనేది సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ఇస్తుంది. మనం అందరం సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ పాటించాల్సి ఉంది.`` అని తెలిపారు.

 


ప్రస్తుతం సీఏఏ కేంద్ర ప్రభుత్వం ముందు ఉందని ముర‌ళీధ‌ర్ రావు పేర్కొన్నారు. `ఎన్ఆర్సీ గురించి ఇప్పుడు కేంద్ర ఆలోచించడం లేదు. ఎన్పీఆర్ అనేది రాజ్యాంగం ప్రకారం జరుగుతుంది. అస్సాంలో ఎం జరిగింది అనేది ఉదాహరణ తీసుకోవాల్సిన అవసరం లేదు...అస్సాంలో ప్రజలు విదేశీయులను వద్దు అంటున్నారు.అస్సాం లో జరిగింది వేరు. ఎన్ఆర్‌సీ అనేది చట్ట ప్రకారం అమ‌లులోకి వస్తుంది. అయినా ఇప్పుడు NRC పైన చర్చ అవసరం లేదు. NRCపై చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. `` అని అన్నారు. ముస్లింల‌కే కాకుండా హ‌ఠాత్తుగా త‌మ‌ తండ్రి పుట్టిన పత్రాలు చూపించాలంటే కూడా తన‌కు కూడా కష్టమేన‌ని ముర‌ళీధ‌ర్ రావు అన్నారు. ఇలాంటి వాటి కోసం గైడ్ లైన్స్ సిద్ధం అవుతున్నాయన్నారు. సీఏఏ అనేది బాలిస్టిక్ మిస్సైల్ లాంటిదని ముర‌ళీధ‌ర్ రావు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: