టీమిండియా యువ ఆటగాడు రిషబ్ పంత్ తనదైన ఆటతో మెరుపులు మెరిపిస్తాడు అన్న విషయం తెలిసిందే. వికెట్ కీపర్ గా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు జట్టులో కీలక ఆటగాడిగా  కూడా ఎదుగుతున్నాడు ఇప్పుడిప్పుడే. అయితే రిశబ్ పంత్ కి ఎన్ని అవకాశాలు వచ్చినప్పటికీ సరిగ్గా యూస్ చేసుకోలేకపోయాడు అనే విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఏ ఆటగానికి ఇవ్వలేనని అవకాశాలను టీమిండియా రిషబ్ పంత్ కోసం ఇచ్చింది. అయిన పంత్ పేలవ ప్రదర్శన చేసిన ప్రతిసారి మాజీ క్రికెటర్లు అందరూ పంత్ కి  అండగా నిలుస్తూ వచ్చారు. రిషబ్ పంత్ కుదురుకోవడానికి కాస్త సమయం పడుతుందని అవకాశాలు ఇవ్వాలని సూచించారు. అయితే అవకాశాలు వచ్చినప్పటికీ రిషబ్ పంత్ నిలకడ లేమీ  కారణంగా పేలవ ప్రదర్శనతో అందరిని నిరాశ పరుస్తున్నాడు

 

 

 ఇదిలా ఉంటే... భారత యువ క్రికెటర్ వికెట్  కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ పై  న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్ ఇయాన్ స్మిత్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో భారత పెద్ద సూపర్ స్టార్ గా అవతరించి పోతుంది రిషబ్ పంత్ అంటూ వ్యాఖ్యానించారు స్మిత్.  అయితే దీనికోసం రిషబ్ పంత్ అతని ఆటతీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటూ ఆయన సూచించాడు. అయితే గత రెండు నెలలుగా పంత్  అనుకున్నంత స్థాయిలో రాణించలేక పోతున్న విషయం తెలిసిందే. రెండు నెలల నుంచి రిజర్వ్ బెంచ్ కే పరిమితమై పోతున్నారు రిషబ్ పంత్. ముఖ్యంగా భారత్ కు  కీలకమైన న్యూజిలాండ్ సిరిస్ లలో  ఆడలేకపోయాడు రిషబ్ పంత్. 

 

 

 ఎన్ని అవకాశాలు వస్తున్నప్పటికీ వాటిని మాత్రం ఉపయోగించుకోలేక పోతున్నారు. రిషబ్ పంత్ ఎంతో ఓపిక తెచ్చుకుని తన ఆట తీరును మార్చుకోవాలని ఈ సందర్భంగా న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్  స్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడిప్పుడే రిషబ్ పంత్ మెరుగు పడుతున్నాడు అంటూ వ్యాఖ్యానించిన స్మిత్... భవిష్యత్తులో రిషబ్ పంత్ పెద్ద స్టార్ అవుతాడు అంటూ స్పష్టం చేశారు. ఇక అటు పంత్ కూడా.. జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: