అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన రెండు రోజులు జరిగింది. ఫిబ్రవరి 24వ తారీఖున భారత్ లో అడుగు పెట్టిన డోనాల్డ్ ట్రంప్ కి అద్భుతమైన స్వాగతం లభించింది. అమెరికా నుండి నేరుగా గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన డోనాల్డ్ ట్రంప్ కి భారత్ ప్రధాని మోడీ...భారతీయ సాంప్రదాయం ఉట్టిపడేలా భారత్ లో ట్రంప్ వేసిన మొట్ట మొదటి అడుగు నుండి అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి నేరుగా అతిపెద్ద క్రికెట్ స్టేడియం కి వెళ్లిన డోనాల్డ్ ట్రంప్ కు మరియు మోడీ ఇద్దరు చేసిన ప్రసంగం ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయిలోనే రికార్డు సృష్టించింది.

 

పూర్తి విషయంలోకి వెళితే అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోడీలు పాల్గొన్న నమస్తే ట్రంప్ కార్యక్రమాన్ని ప్రపంచంలోనే అత్యధిక మంది టీవీలలో వీక్షించినట్లుగా తాజాగా లెక్కలు బయటకు వచ్చాయి. మొత్తం 4.60కోట్ల మంది టీవీల ద్వారా ఆ కార్యక్రమం చూశారని 180 టీవీ చానెళ్లు ప్రసారం చేశాయని బ్రాడ్‌కాస్ట్‌ ఆడియెన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌(బీఏఆర్‌సీ) తెలిపింది. దేశవ్యాప్తంగా 4.60 కోట్ల మంది ఈ కార్యక్రమాన్ని తిలకించారని, 1,169 కోట్ల వ్యూయింగ్‌ మినిట్స్‌ నమోదైనట్లు ప్రభుత్వానికి బీఏఆర్‌సీ తెలిపింది. ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవానికి వీక్షించిన వారికంటే ఇది రెండింతలు కావడం విశేషం. దీంతో ఇండియా వేదికగా డోనాల్డ్ ట్రంప్ ఆస్కార్‌ రికార్డు బద్దలు కొట్టినట్లు అయిందని అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి.

 

ముఖ్యంగా భారత్ పర్యటన జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలు ఉన్నాయి అంటూ డోనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా సోషల్ మీడియాలో తన మనసులోని భావాలను బయటపెట్టింది. అద్భుతమైన స్వాగతం భారత్ ఇచ్చిందని...తెలియజేస్తూ భారత్ లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో గత రెండు రోజుల నుండి పోస్ట్ చేస్తూనే ఉంది. ఇదే సందర్భంలో కూతురు ఇవాంకా ట్రంప్ కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తూ భారత్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: