ఎయిర్ పోర్టు నుండి వెనక్కు తిరిగి వచ్చేయటాన్ని చంద్రబాబునాయుడు చాలా ప్రిస్టేజ్ గా తీసుకున్నాడు. నిజానికి ఇంత గొడవ జరిగిందంటే అందుకు టిడిపి నేతలనే తప్పు పట్టాలి. సరే దాదాపు ఆరు గంటల పాటు జరిగిన హై ఓల్టేజ్ డ్రామా తర్వాత చేసేది లేక చంద్రబాబు అండ్ కో హైదరాబాద్ కు తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా రాష్ట్రంలో పర్యటిస్తున్న చంద్రబాబు విశాఖ పట్నం విమానాశ్రయం నుండి బయటకు వెళ్ళలేక పోవటాన్ని ప్రిస్టేజ్ గా తీసుకున్నారు.

 

అందుకనే గురువారం రాత్రి హైదరాబాద్ కు తిరిగి వచ్చిన చంద్రబాబు శుక్రవారం ఉదయానికే హై కోర్టులో కేసు వేశారు. పార్టీ తరపున మాజీ ఎంఎల్ఏ శ్రవణ్ కుమార్ కోర్టులో కేసు వేశారు. వెంటనే  ఉత్తరాంధ్రలో పర్యటించటానికి చంద్రబాబుకు అనుమతి ఇవ్వాల్సిందిగా పిటీషన్ లో కోరారు. అంటే చంద్రబాబు, టిడిపి నేతల ఉద్దేశ్యంలో ఇలా కోర్టులో కేసు వేయగానే పర్యటనకు అనుమతించాల్సిందిగా అలా కోర్టు ఆదేశాలు ఇచ్చేస్తుందని అనుకున్నారు.

 

అయితే కేసును విచారించిన కోర్టు మార్చి 2వ తేదీకి విచారణను వాయిదా వేసింది. ఆ తర్వాత కూడా విచారణ మళ్ళీ వాయిదా పడదని గ్యారెంటీ ఏమీ లేదులేండి.  ఎయిర్ పోర్టు దగ్గర బందోబస్తు విషయంలో ఏమి జరిగిందో చెప్పాలంటూ కోర్టు పోలీసులను ఆదేశించింది. దాంతో కౌంటర్ వేయటానికి పోలీసులకు కోర్టు నాలుగు రోజులు గడువిచ్చింది. అంటే మరి నాలుగు రోజులు చంద్రబాబు ఏమి చేయాలి ?  కోర్టులో కేసు తేలేదాక ప్రజా చైతన్య యాత్రలకు బ్రేక్ పడినట్లేనా ? 

 

ఇపుడీ విషయాల్లో క్లారిటి లేక  తమ్ముళ్ళు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. సరే అందరికీ అర్ధమవుతున్నదేమంటే కోర్టులో కేసు తేలేదాక ఉత్తరాంధ్ర పర్యటన ఉండదని. మొత్తానికి చంద్రబాబు తెలివైన వాడో లేకపోతే ఉత్తరాంధ్ర జనాలు గట్టి వాళ్ళో అర్ధం అవటానికి మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: