కొన్నాళ్ల క్రితం ప్రత్యర్థి జట్లు  అన్నింటినీ బెంబేలెత్తించిన కోహ్లీ సేన... ప్రస్తుతం పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తోంది. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న కోహ్లీసేన మొదటి టి20 సిరీస్ లో అదరగొట్టినప్పటికీ ఆ తర్వాత.. వన్డే సిరీస్ లో మాత్రం నిరూపించుకో లేకపోయింది. ఇక ఇప్పుడు టెస్ట్ సిరీస్ లో కూడా కోహ్లీ సేన పేలవ ప్రదర్శన చేస్తూ వస్తోంది. ఎంతో ప్రతిభావంతులైన బ్యాట్స్మెన్లు ఉన్నప్పటికీ... ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కోలేక వరుసగా పెవిలియన్ చేరుతున్నారు. ఇప్పటికే మొదటి టెస్ట్ మ్యాచ్లో గోరంగా విఫలం అయిన కోహ్లీసేన పై ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. ఇక తాజాగా ఈరోజు జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో కూడా కోహ్లీ సేన తీరు మారినట్లు మాత్రం కనిపించడం లేదు. కోహ్లీ సేన 113 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. 

 

 

 తొలి మ్యాచ్లో అద్భుతంగా రాణించిన అజింక్యా రహానే ఈ మ్యాచ్లో కేవలం 7 పరుగులు మాత్రమే చేసి... న్యూజిలాండ్ బౌలర్ సౌతీ బౌలింగులో పెవిలియన్ బాట పట్టాడు. ఇక గత కొన్ని రోజులుగా వరుసగా విఫలం అవుతున్న  టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి బోల్తా కొట్టాడు. కేవలం మూడు పరుగులకు పెవిలియన్ బాట పట్టాడు విరాట్ కోహ్లీ. సౌదీ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యు గా వెనుదిరిగాడు. దీంతో భారత్ 25 పరుగుల వద్ద మూడు కీలక వికెట్లు కోల్పోయింది. విరామ సమయానికి 85 పరుగులతో మూడు వికెట్లతో ఉంది టీమిండియా. ప్రస్తుతం చటేశ్వర్ పుజారా 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

 

 

 మొదటి టెస్టు మ్యాచ్లో రాణించలేకపోయిన.. భారత యువ ఓపెనర్ పృథ్వీ షా రెండవ టెస్ట్ మ్యాచ్లో రాణించాడు.  అయితే మొదట టాస్ గెలిచి న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియం సన్ ఇండియాను బ్యాటింగ్ కి ఆహ్వానించాడు. ఇక మొదట బ్యాటింగ్ కు  వచ్చిన భారత ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి టెస్టు మ్యాచ్లో అద్భుతంగా రాణించిన మయాంక్ అగర్వాల్ కేవలం 7 పరుగులు చేసి వెనుదిరిగాడు. దీంతో 30 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోవాల్సి  వచ్చింది. అయితే బౌలింగ్ కు అనువైన క్రైస్ట్ చర్చ్  ఓవల్ మైదానంలో పూర్తి  పృద్విషా  మాత్రం బౌలర్లను  ఇబ్బంది పెడుతూ చెలరేగి ఆడుతున్నాడు. టెస్టు మ్యాచుల్లో పృద్విషా  తొలి అర్ధ సెంచరీ సాధించాడు. 64 బంతుల్లో 54 పరుగులు చేశాడు. ఇక పృద్విషా  భారీ ఓపెనింగ్స్ ఆడుతాడు అనుకుంటున్న సమయంలో   క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: