ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.   ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా చిన్న పొరపాటు వల్ల రెప్పపాటున ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.  వీటి వల్ల ఎన్ని అనర్ధాలు జరుగుతున్నాయో తల్చుకుంటేనే కన్నీరు ఆగదు.  తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, గాయాలతో అంగవైకల్యం జీవితాంతం వెంటాడుతుంది. తాజాగా పాకిస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సును రైలు ఢీకొన్న ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్థాన్‌ సింధ్ ప్రాంతంలోని సుక్కూరు జిల్లా రోహ్రీ ప్రాంతంలో జరిగిందీ దుర్ఘటన.  గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలిస్తున్నామని కంధ్రా కమిషనర్ షఫీక్ మహేసర్ తెలిపారు.

 

ఈ ప్రమాదంలో మహిళలు, పిల్లలు కూడా మరణించినట్లు షఫీక్ మహేసర్ తెలిపారు. పాకిస్తాన్ ఎక్స్‌ప్రెస్ రైలు కరాచీ నుండి రావల్పిండికి వెళుతుండగా రైల్వే క్రాసింగ్ వద్ద బస్సును ఢీకొట్టింది.. దీంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదంలో బస్సు పూర్తిగా నుజ్జు అయినట్టు చెప్పారు. బస్సును రైలు దాదాపు 200 అడుగుల వరకు ఈడ్చుకెళ్లినట్టు వివరించారు. తీవ్రంగా గాయపడిన 60 మందిని ఆసుపత్రులకు తరలించినట్టు తెలిపారు. ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పాకిస్థాన్ జాతీయ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చెయ్యాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

 

ఇక ఈ ఘటనపై పాకిస్తాన్ రైల్వే ప్రతినిధి మాట్లాడుతూ.. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అనిపించిందని చెప్పారు. రోడ్డు ప్రమాదాలపై ఎంత అవగాహన కల్పించిన కొంత మంది చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది నిండు ప్రాణాలు పోతున్నాయని ఆయన అన్నారు.  పాకిస్తాన్ రైల్వేలో 2,470 మంది మానవరహిత స్థాయి క్రాసింగ్ ల వద్ద సిబ్బంది లేరని.. వారిని నియమించుకోవలసిందిగా గతంలో ప్రాంతీయ ప్రభుత్వాలకు లేఖ రాసినట్లు ఆయన చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: