కరోనా వైరస్ ధాటికి ఇప్పుడు ఎవరైనా బలి కావాల్సిందే అన్నట్లు ఇప్పటి వరకు కరోనా సోకి డాక్టర్లు సైతం మరణించిన విషయం తెలిసిందే. తాజాగా కారోనా మహమ్మారి ధాటికి ఏకంగా ఇరాన్ ఉపాధ్యక్షురాలు కూడా చేరిపోయారు. ఇరాన్‌లో కరోనావైరస్ మహమ్మారికి 26 మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి కియానౌష్ జహన్‌పూర్ ఒక వార్తా సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలో కొత్తగా 106 కేసులు నమోదయ్యాయని.. దాంతో మొత్తం కేసుల సంఖ్య 245 కు పెరిగిందని అన్నారు.  చైనా వెలుపల కరోనా వైరస్ ద్వారా మరణించిన వారు ఎక్కువగా ఉన్న దేశం ఇదే.. కాగా కరోనావైరస్ బాధితులలో ఇరాన్ ఉపాధ్యక్షురాలు కూడా చేరిపోయారు.

 

ఇరాన్ ఏడుగురు ఉపాధ్యక్షులలో మహిళల వ్యవహారాలను పర్యవేక్షించే మసౌమెహ్ ఎబ్టెకర్ ఇందులో ఉన్నారు. ఈ విషయాన్ని ఎబ్తేకర్‌ సలహాదారు ఫరీబా మీడియాకు వెల్లడించారు. ఈ మద్య వీరి రక్త నమునాలను సేకరించి ల్యాబ్ కు పంపారు. రిపోర్టులు ఈరోజు వచ్చే అవకాశం ఉందని ఎబ్తేకర్‌ సలహాదారు ఫరీబా మీడియాకు వెల్లడించారు. ఉపాధ్యక్షురాలే కాదు ఆ దేశ పార్లమెంటు జాతీయ భద్రత మరియు విదేశీ వ్యవహారాల కమిటీ అధిపతి మొజ్తాబా జోల్నూర్ కూడా వైరస్ బారిన పడ్డారు. మరోవైపు కరోనా మహమ్మారి చైనాలో ఇప్పటికే 2,810మందిని బలి తీసుకుంది.

 

మరో 78,600మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. కరోనాతో ప్రపంచవ్యాప్తంగా 51 దేశాల్లో 82వేలకు మందికి పైగా ఆస్పత్రుల్లో చేరారు. ఇటలీలో కరోనా పాజిటివ్ కేసులు 650కు చేరుకోగా, నెదర్లాండ్స్ లో తొలి కరోనా కేసు నమోదైంది.. ఇటు సౌత్ కొరియాలో 13మంది మృత్యువాత పడగా బాధితుల సంఖ్య 2000 దాటింది.  అయితే ఇరాన్ లో ఉపాధ్యక్షురాలే కాదు ఆ దేశ పార్లమెంటు జాతీయ భద్రత మరియు విదేశీ వ్యవహారాల కమిటీ అధిపతి మొజ్తాబా జోల్నూర్ కూడా వైరస్ బారిన పడ్డారు. అతను స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు ఫార్స్ వార్తా సంస్థ పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: