ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా జనాలపై ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియా టీవీలు చూస్తూ నేరాలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. టీవీలో చూసి ఇన్స్పయిర్ అయ్యి నేరాలకు పాల్పడడం ఆ తర్వాత పోలీసులకు దొరికి కటకటాల పాలు అవ్వడం ఈ రోజుల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి. ఇక తాజాగా ఇలాంటి ఘటనే మరోటి జరిగింది. సినిమాని తలపించేలా కడప నగరంలో ఓ యువతి కిడ్నాప్ జరిగింది. అయితే దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేవలం పది గంటల్లోనే కేసును ఛేదించి శభాష్ అనిపించారు. ఇక ఈ కేసు చేధింపులో  పోలీసులు పలు సంచలన నిజాలు తెలుసుకొని అవాక్కయ్యారు. ముఖ్యంగా త్రిల్లింగ్ సినిమాని తలపించేలా ఉన్న ఈ  కిడ్నాప్ ఉదంతం లో మాటలు విని షాక్ కి గురయ్యారు పోలీసులు. అంతే కాదు ఇలాంటి కిడ్నాప్ లు  తాము తమ సర్వీసులను ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు. 

 

 

 వివరాల్లోకి వెళితే... కడప వైవి స్ట్రీట్ కు చెందిన 21 ఏళ్ల యువతి కిడ్నాప్ అయింది. అయితే ఆ యువతిని కిడ్నాప్ చేసింది... ఆ యువతి చదువుతున్న ఇంజనీరింగ్ కాలేజీ లో పనిచేసే ప్రొఫెసర్ అని విచారణలో తేలింది. ప్రస్తుతం ఆ వ్యక్తి గ్రామ సచివాలయం లో కార్యదర్శి గా పని చేస్తున్నాడు. డేరంగుల కృష్ణమోహన్ అనే వ్యక్తి ఆ యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అయితే కృష్ణమోహన్ కు ఇప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ కూడా... ప్రేమ పేరుతో యువతిని వెంటపడుతున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి యువతి ఇంట్లో ఒంటరిగా ఉందని భావించిన కృష్ణమోహన్ ఆమెను కిడ్నాప్ చేయాలని భావించి బుర్కా వేసుకొని ఇంట్లోకి వెళ్లి ఆమెను బెదిరించి బలవంతంగా ఇంటికి తాళం వేసి ఆ యువతిని కిడ్నాప్ చేశాడు ఇది  గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు బృందాలుగా ఏర్పడి కేవలం కొన్ని గంటల్లోనే ఈ కేసును ఛేదించి ఆ యువతిని  రక్షించారు. 

 

 

 

 యువతి సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఈ కేసును ఛేదించారు పోలీసులు. అయితే కృష్ణమోహన్ ఆ యువతిని కిడ్నాప్ చేసిన తీరును చూసి పోలీసులే షాక్ కి గురయ్యారు. యువతిని కిడ్నాప్ చేసేందుకు వెళ్లిన కృష్ణమోహన్ పుర్రె ఎముకలు ఇంట్లో  వేసి ఇల్లంతా పెట్రోల్ పోసి ఆ తర్వాత గ్యాస్ లీక్ చేసి... ఇంట్లో ఒక క్యాండిల్ వెలిగించి వచ్చాడు. అంటే గ్యాస్ క్యాండిల్ కి అంటుకొని పెట్రోల్ తో ఇల్లు మొత్తం కాలిపోయి ఆ మంటల్లో  యువతి సజీవదహనం అయిపోయి ఎముకలు మిగిలాయి అనుకుంటారని ఇలా ప్లాన్ చేశాడు కృష్ణమోహన్. కానీ సకాలంలో పోలీసులు ఆ ఇంటికి చేరుకుని క్యాండీలు ఆర్పేసి గ్యాస్ బంద్ చేశారు. అయితే ఇదంతా యూట్యూబ్ లో చూసి కృష్ణ మోహన్ కిడ్నాప్ ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: