వ్యవహారం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. రాష్ట్రంలో తన ఆప్తమిత్రుడు, ఆత్మబంధువు అయిన చంద్రబాబునాయుడును అన్నీ వైపుల రాజకీయంగా కుళ్ళబొడిచేస్తుంటే చూస్తు కూడా ఏమీ చేయలని అసహయాతతో మిగిలిపోతున్నారు. ఇదంతా ఎవరి గురించో ఈ పాటికే అర్ధమైపోయుంటుంది. అవునే ఆయన ఉపరాష్ట్రపతి వెంకయ్యానాయుడు. వెంకయ్య-చంద్రబాబు మధ్య ఉన్న విడదీయరాని బంధం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

 

ఇటువంటి వెంకయ్య తన ఆత్మబంధును ఏ విధంగా కూడా ఆదుకునే పరిస్ధితిలో పడిపోయారు. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో బిజెపి ఇంత ధీనస్ధితిలో పడిపోవటానికి ప్రధాన కారణం వెంకయ్య అనే ఆరోపణలు కావాల్సినంత ఉంది. ప్రత్యేకించి రాష్ట్ర విభజన తర్వాత ఒకదశలో బిజెపి తెలుగుదేశంపార్టీకి తోకపార్టీలాగ తయారైపోయిందనే ఆరోపణలు వచ్చాయంటే వెంకయ్య పుణ్యమే అది.

 

పార్టీని హోల్ సేల్ గా చంద్రబాబుకు తాకట్టు పెట్టేశారనే ఆరోపణలు పెరిగిపోవటంతో వ్యూహాత్మకంగా నరేంద్రమోడి, అమిత్ షా ఇద్దరూ మాట్లాడుకుని వెంకయ్యను క్రియాశీల రాజకీయాల నుండి తప్పించేశారు. అప్పటి వరకూ కేంద్రమంత్రిగా ఉన్న వెంకయ్యను ఉపరాష్ట్రపతిని చేసేశారు. దాంతో ఇష్టంలేకపోయినా అంగీకరించక తప్పలేదు. అప్పటి నుండే చంద్రబాబుకు కష్టాలు మొదలయ్యాయనటంలో సందేహం లేదు.

 

తాజా పరిస్ధితులనే తీసుకుంటే మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు  ఘోరంగా ఓడిపోయిన తర్వాత కష్టాల మీద కష్టాలు మీద పడుతున్నాయి. ఒకవైపు అధికార వైసిపి మరోవైపు సొంతపార్టీ బిజెపి చంద్రబాబును రాజకీయంగా కుళ్ళబొడిచేస్తున్నాయి. జగన్ కు వ్యతిరేకంగా చంద్రబాబు ఓ ప్రకటన చేయగానే బిజెపిలోని కొందరు నేతలు జగన్ కు మద్దతుగా మాట్లాడుతున్నారు. తాజాగా విశాఖపట్నం విమానాశ్రయంలో చంద్రబాబుపై జరిగిన దాడే ఉదాహరణ.  తమపై దాడులు చేయించిన చంద్రబాబుకు ఇపుడు తగిన శాస్తే జరిగిందని కొందరు బిజెపి నేతలు రెచ్చిపోతుంటే ఏమీ చేయలని నిస్సహాయ స్దితిలో పడిపోయారు. పాపం వెంకయ్య ఇదంతా చూస్తు ఎలా తట్టుకుంటున్నారో ?

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: