తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈరోజు డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్‌ చైర్మన్ పేర్లను ప్రకటించారు.అదిలాబాద్ డీసీసీబీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి.. అదిలాబాద్ డీసీసీబీ చైర్మన్ గా నాందేవ్ కాంబ్లే ఎన్నిక కాగా వైస్ చైర్మన్ గా రఘునందన్ రెడ్డి ఎన్నికయ్యారు. డీసీఎంఎస్ చైర్మన్ గా తిప్పని లింగయ్య ఎన్నిక కాగా వైస్ చైర్మన్ గా కొమురం మాంతయ్య ఎన్నికయ్యారు. ఖమ్మం డీసీసీబీ చైర్మన్ గా కూరాకుల నాగభూషణం, వైస్ చైర్మన్ గా దొండపాటి వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు. 
 
ఖమ్మం డీసీఎంఎస్ చైర్మన్ గా రాయల్ శేషగిరి రావు ఎన్నిక కాగా వైస్ చైర్మన్ గా కొత్వాల శ్రీనివాస్ ఎన్నికయ్యారు. నిజమాబాద్ డిసీసీబీ చైర్మన్ గా పోచారం భాస్కర్ రెడ్డి ఎన్నిక కాగా డీసీసీబీ వైస్ చైర్మన్ గా రమేష్ రెడ్డి ఎన్నికయ్యారు. డీసీఎంఎస్ చైర్మన్ గా నల్లనేని మోహన్ ఎన్నికయ్యారు. నల్గొండ డీసీసీబీ చైర్మన్ గా గొంగిడి మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ గా ఏసిరెడ్డి దయాకర్ రెడ్డి ఎన్నికయ్యారు. 
 
నల్గొండ డీసీఎంఎస్ చైర్మన్ గా పట్టి జానయ్య యాదవ్, వైస్ చైర్మన్ గా దుర్గంపూడి నారాయణ రెడ్డి ఎన్నికయ్యారు. వరంగల్ డీసీసీబీ చైర్మన్ గా మార్నేని రవీందర్ రావు, వైస్ చైర్మన్ గా మందూరు వెంకటేశ్వర రెడ్డి ఎన్నికయ్యారు. డీసీఎంఎస్ చైర్మన్ గా గగులోతు రామస్వామి నాయక్, వైస్ చైర్మన్ గా దేవిని శ్రీనివాస్ రెడ్డి ఎన్నికయ్యారు. రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ గా బుయ్యాని మనోహర్ రెడ్డి, వైస్ చైర్మన్ గా సత్తయ్య ఎన్నికయ్యారు. 
 
మహబూబ్ నగర్ డీసీసీబీ చైర్మన్ గా నిజాంషాషా, వైస్ చైర్మన్ గా కోరమోని వెంకటయ్య ఎన్నికయ్యారు. డీసీఎంఎస్‌ చైర్మన్‌గా ప్రభాకర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా హర్యానాయక్‌ ఎన్నికయ్యారు. మెదక్ డీసీసీబీ చైర్మన్‌గా చిట్టి దేవేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా పట్నం మాణిక్యం ఎన్నిక కాగా డీసీఎంఎస్ చైర్మన్‌గా మల్కాపురం శివకుమార్, వైస్ చైర్మన్‌గా అరిగె రమేష్ ఎన్నికయ్యారు. కరీంనగర్ డీసీసీబీ చైర్మన్‌గా కొండూరి రవీందర్ రావు, వైస్ చైర్మన్‌గా రమేష్ ఎన్నిక కాగా డీసీఎంఎస్ చైర్మన్‌గా శ్రీకాంత్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా ఫక్రుద్దీన్ ఎన్నికయ్యారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: