టిడిపి ప్రభుత్వ హయాంలో లెక్కకు మిక్కిలిగా అవినీతి చోటుచేసుకుందని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే గత ప్రభుత్వంలోని అక్రమాలు అన్నిటిని తవ్వి తీసేందుకు సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం దర్యాప్తులో భాగంగా అమరావతి ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ పై పూర్తి స్థాయిలో దర్యాప్తు మొదలు పెట్టింది. ప్రధానంగా అమరావతి వ్యవహారంలో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, వారి బంధువులు, కుటుంబ సభ్యుల ఇళ్లపై సిట్ బృందం తనిఖీలు చేపట్టారు. రాజధానిలో కొనుగోలు చేసిన భూముల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. సిట్ దర్యాప్తు వ్యవహారం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

IHG


 దాదాపు నాలుగైదు గంటలపాటు ఈ వ్యవహారం సాగినట్లు గా తెలుస్తోంది. ఇప్పటికే ఓ భారీ బిల్డర్ ను అదుపులోకి తీసుకుని సమగ్రంగా వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది. సిట్  ప్రత్యేక అధికారి ఇంటిలిజెన్స్ ఐజి కొల్లి రఘురాం రెడ్డి బృందం విజయవాడలో తనిఖీలు నిర్వహించింది. రాజధానిలో భూములు కొనుగోలు చేసిన తెల్ల రేషన్ కార్డు దారులు వెనక ఉన్నబడా వ్యక్తులను పట్టుకునేందుకు కొంతమందికి తెలుగుదేశం నాయకుల ఇళ్లపై సోదాలు నిర్వహించింది. ముఖ్యంగా టీడీపీ మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు వియ్యంకుడి ఇంటిపై అధికారులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కంప్యూటర్ హార్డ్ డిస్క్ తో పాటు ఇతర ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు బ్యాంకుల వివరాలు స్వాధీనం చేసుకున్నారు.


 ఈ సందర్భంగా వారికి కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే రాజధాని భూముల వ్యవహారంలో టిడిపి మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు. నారాయణ లపై సీఐడీ ఏడు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. రాజధానిలో 797 మంది తెల్ల రేషన్ కార్డు దారులు కొనుగోలు చేసిన భూములు తదితర వివరాలను సీఐడీ సేకరించి నేపథ్యంలో వాటి పూర్తి వివరాలను సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంతో తెలుగుదేశం నాయకులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: