కరోనా వైరస్  ప్రస్తుతం ప్రపంచ దేశాలను ప్రాణభయంతో వణికిస్తున్న విషయం తెలిసిందే. చైనాలోని వుహాన్ నగరంలో గుర్తించబడిన కరోనా  వైరస్ ఇప్పటికే చైనా దేశంలో ఎంతోమంది ప్రాణాలను బలిగొంది. ప్రాణాంతకమైన వైరస్ బారినపడి 2,800 మందికి పైగా ప్రజలు చనిపోయారు. అధికారికంగా 2,800 మంది అయినప్పటికీ అనధికారికంగా మాత్రం ఈ సంఖ్య భారీగా ఉండొచ్చు అనే అనుమానాలు కూడా వస్తున్నాయి ఇక ఈ రకమైన వైరస్ బారినపడి ఏకంగా అరవై ఎనిమిది వేలకు పైగా మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. అయితే కేవలం చైనాలోని ప్రజల ప్రాణాలు పైనే కాదు.. అన్ని రంగాల పైన ఈ ప్రాణాంతకమైన వైరస్ ప్రభావం పడుతుంది. దీంతో ఆర్థికంగా అన్ని దేశాలు ఈ కరోనా ఎఫెక్టుతో కుదేలవుతున్నాయి. 

 

 

 ముఖ్యంగా ఈ ప్రాణాంతకమైన కరోనా వైరస్ కారణంగా ప్రపంచ మార్కెట్ లు  అన్ని విలవిలలాడిపోతూ ఉన్నాయి. మరోవైపు దేశీయ ఈక్విటీ మార్కెట్లు కూడా భారీ మొత్తంలో నష్టపోతున్నాయి. కరోనా ఎఫెక్టుతో ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ లు  డీలా పడిపోయాయి. అయితే కరోనా ఎఫెక్ట్ తో కుబేరులు  వరుస నష్టాలను చవి చూస్తున్నారు.  ఏకంగా కుబేరుల  సంపద కూడా పది లక్షల కోట్లు వరకు ఆవిరై పోయింది అని చెప్పాలి. శుక్రవారం ఒక్కరోజే నాలుగు లక్షల కోట్లకు పైగా సంపద నిమిషాల్లో కరిగిపోయింది. కరోనా ఎఫెక్ట్  ఎక్కడ అడ్డుకట్ట వేసేందుకు కూడా వీలు  లేకపోవడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచుపుతున్నారు . దీంతో దేశంలోని కుబేరులు కూడా చాలామంది తమ సంపదను భారీ మొత్తంలో కోల్పోయారు. 

 

 

 ఇక ఈ కరుణ ఎఫెక్టుతో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్... భారతదేశం అగ్ర సంపన్నుడు ముఖేష్ అంబానీ ఈ ఏడాది తన సంపదలు 5 బిలియన్ డాలర్లకు పైగా కోల్పోయారు. కేవలం ముఖేష్ అంబానీ ఏ కాకుండా ఎంతో మంది ప్రపంచ కుబేరులు కూడా స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పడిపోవడంతో భారీగా నష్టపోయారు. సెన్సెక్స్ 1500 పాయింట్లతో కుప్పకూలడంతో మార్కెట్ క్యాప్ పరంగా టాప్ లో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ దర  శుక్రవారంనాడు 4.12 శాతం క్షీణించిపోయింది. దీంతో భారత అగ్ర సంపన్నుడు కి సంపద ఆవిరై పోక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: