ఈ మధ్యకాలంలో చిన్న చిన్న విషయాలకే విద్యార్థులు తనువు చాలిస్తున్న  విషయం తెలిసిందే. తల్లిదండ్రులు తిట్టారనో  లేదా గురువులు మందలించారనో  ఇలా చిన్నచిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగులుస్తున్నారు. ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలకే క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకున్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇంకా లోకాన్ని కూడా సరిగ్గా చూడకముందే ఉరికొయ్యకు వేలాడుతున్నారు. ఇక ఇటీవలే హైదరాబాద్లో అయితే విద్యార్థుల ఆత్మహత్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. 

 

 

 తాజాగా హైదరాబాద్ మీర్పేట్ పాలిటెక్నిక్ కాలేజీలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఫైనల్ ఇయర్ చదువుతున్న సంధ్య అనే అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది. దీంతో కాలేజీ విద్యార్థులు ఏకంగా కాలేజీ ముందు ఆందోళనకు దిగారు కూడా.సంధ్య  ఆత్మహత్య కు  లెక్చరర్ స్వాతి  వేధింపులే కారణమని ధర్నాకు దిగారు. ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్ లో మరో బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం సృష్టిస్తోంది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాంచారమ్మ బస్తి లో ఉండే శ్రీధర్ అనే బీటెక్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. 

 

 

 ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ప్రాణం తీసుకున్నాడు బీటెక్ విద్యార్థి శ్రీధర్. అయితే తన చావుకు పక్కింటివారి కారణం అంటూ సూసైడ్ లెటర్ రాసి చనిపోయాడు. తాను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అనసూర్య ఆమె భర్త దశరథి కారణం అంటూ సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు ఆ విద్యార్థి. నా జీవితం నాశనం కావడానికి వీళ్లిద్దరు మాత్రమే కారణమని... సూసైడ్ నోట్  లో రాసి ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఆ విద్యార్థి. ఇక ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకుని ఆ సూసైడ్ నోట్ ఆధారంగా వారిద్దరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది,

మరింత సమాచారం తెలుసుకోండి: