ఆన్‌లైన్‌ డెలవరీ పోర్టల్‌లు ఉగ్రవాదులకు యూజర్ ఫ్రెండ్లీగా మారాయా...? పేలుళ్ల ముడి సరుకును ఈజీగా చేరవేస్తున్నాయా...? పుల్వామా దాడిలో ఉపయోగించిన ఆర్డీఎక్స్‌ ఉగ్రవాదులకు ఎలా  చేరింది...?  ఇలాంటివన్నీ ఇప్పుడు తెరమీదికి వస్తున్నాయి. 

 

ఈ కామర్స్‌లో దొరకని వస్తువు లేదు. గుండు పిన్ను నుంచి హోమ్‌ అప్లయిన్స్‌ వరకూ...అన్నీ కొనుక్కోవచ్చు. దీన్నే ఉగ్రవాదులు తమకు అవకాశంగా మలుచుకుంటున్నారు. పేలుళ్లకు కావాల్సిన ముడిసరుకును ఆన్‌లైన్‌ డెలివరీ పోర్టళ్ల ద్వారా తెప్పించుకుంటున్నారు. గతేడాది జరిగిన పుల్వామా ఉగ్రదాడిలోనూ టెర్రరిస్టులు దీన్నే ఉపయోగించినట్లు ఎన్‌ఐఏ విచారణలో తేలింది. 

 

పుల్వామా ఉగ్రదాడితో సంబంధం ఉన్న ఉగ్రవాదిని ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. అతడు పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్ గ్రూపుకు చెందిన షకీర్ బషీర్ మాగ్రేగా గుర్తించాడు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా... సంచలన విషయాలు బయటపెట్టాడు. ఉగ్రదాడికి ఉపయోగించిన పేలుడు పదార్థాలను ఓ ఆన్‌లైన్ డెలివరీ పోర్టల్ ద్వారా కొనుగోలు చేసినట్టు తెలిపాడు. పేలుడుకు ఉపయోగించిన బ్యాటరీ, అమోనియం నైట్రేట్ పదార్థాలను ఆన్‌లైన్‌ పోర్టల్‌ నుంచి కొనుగోలు చేసినట్టు ఒప్పుకున్నాడు. 

 

అంతేకాదు... పుల్వామా దాడిలో ఉపయోగించిన మారుతీ వాహనాన్ని తానే సమకూర్చినట్లు తెలిపాడు. ఆ రోజే...పేలుడు పదార్థాలతో నింపిన మారుతీ వాహనాన్ని నడిపినట్లు చెప్పాడు. సీఆర్‌పీఎఫ్‌ బలగాల కాన్వాయ్‌కు 500 మీటర్ల దూరంలో వాహనం నుంచి దిగిపోయానని తెలిపాడు. ఆ తర్వాత ఆదిల్ అహ్మద్ కారును డ్రైవ్ చేశాడన్నారు. ఆత్మాహుతికి పాల్పడిన ఆదిల్ అహ్మద్‌, పాక్‌ ఉగ్రవాది ఉమర్ ఫరూక్‌కు ఆశ్రయం కల్పించినట్లు నేరం అంగీకరించాడు ఉగ్రవాది. 

 

పుల్వామా దాడికి ఏడాది ముందు నుంచే ప్లాన్ చేసినట్లు ఎన్‌ఐఏ విచారణలో తేలింది. షకీర్ బషీర్ మాగ్రే లెత్పోరా బ్రిడ్జీ సమీపంలో ఫర్నీచర్‌ దుకాణం ఉంది. పాక్ ఉగ్రవాది మహమ్మద్ ఉమర్ సలహాతో శ్రీనగర్‌ హైవేపై వెళ్లే సీఆర్పీఎఫ్‌ కదలికలను గమనించాడు. కాన్వాయ్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు మహమ్మద్ ఉమర్, ఆదిల్ అహ్మద్‌లకు సమాచారం చేరవేసేవాడు. ఇతడికి మరో ఇద్దరు సహకరించేవారు. మొత్తం ఐదుగురు కలిసి ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఇప్పటికే ఇద్దరు ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్‌ కాగా... తాజాగా మోగ్రే పట్టుబడ్డాడు. అతన్ని ఎన్ఐఏ కోర్టులో ప్రవేశపెట్టగా....15 రోజుల రిమాండ్ విధించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: