మార్చి 1వ తేదీన ఒకసారి చరిత్ర లోకి వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య  ఎంతో మంది ప్రముఖుల జననాలు జరిగాయి. ఈ రోజు ఒక్కసారి చరిత్ర లోకి వెళ్లి ఏం జరిగింది రండి. 

 

 చెరుకువాడ వేంకట నరసింహం జననం : ఉపన్యాస కేసరిగా ఎంతగానో ప్రసిద్ధి చెందిన చెరుకువాడ వేంకట నరసింహం 1887 మార్చి 1వ తేదీన జన్మించారు.

 

 నల్లపాటి వెంకటరామయ్య జననం : ఆంధ్ర రాష్ట్ర ప్రథమ శాసనసభ స్పీకర్ అయిన నల్లపాటి వెంకటరామయ్య 1901 మార్చి 1వ తేదీన జన్మించారు. 1952 లో మొట్ట మొదటి సార్వత్రిక ఎన్నికల్లో నరసరావుపేట శాసనసభ స్థానం నుంచి గెలుపొందారు నల్లపాటి వెంకట రామయ్య. 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ప్రకాశం ముఖ్యమంత్రి గా నియమితులయ్యారు. 1953 నవంబరు 23న వెంకట్రామయ్య శాసనసభ పతిగా  ఎన్నికయ్యారు. 24 సంవత్సరాల పాటు న్యాయ వృత్తిలో కొనసాగిన  నల్లపాటి వెంకటరామయ్య శాసన సభను కూడా న్యాయపరంగా నడిపించాడు. 1955 నుంచి 1962 వరకు శాసనసభ సభ్యుడిగా కొనసాగారు నల్లపాటి వెంకటరామయ్య.

 

 

 ఖండవల్లి లక్ష్మీరంజనం జననం  : సుప్రసిద్ధ సాహిత్యవేత్త మరియు పరిశోధకుడు అయిన ఖండవల్లి లక్ష్మీరంజనం 1908 మార్చి 1వ తేదీన జన్మించారు. వివేకానంద ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో ఒక విద్యా సంస్థను ప్రారంభించి బాలబాలికలకు వేరువేరుగా ఉన్నత పాఠశాలను నెలకొల్పారు ఖండవల్లి లక్ష్మీరంజనం.ఈయన స్థాపించిన ఆంధ్ర రాష్ట్ర కళాశాల ప్రస్తుతం ఆచార్య ఖండవల్లి లక్ష్మీ రంజనం ప్రభుత్వ ప్రాచ్య కళాశాలగా  అభివృద్ధి చెందింది. ఖండవల్లి లక్ష్మీరంజనం జయంతి సందర్భంగా కళాశాల స్వర్ణోత్సవాలు 2008 సంవత్సరంలో హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి.

 

 

 ఆవేటి పూర్ణిమ జననం : ప్రముఖ తెలుగు రంగస్థల నటీమణులు అయిన ఆవేటి పూర్ణిమ 1918 మార్చి 1వ తేదీన జన్మించారు. రంగస్థలం నటీనటుల్లో  ఎంతో ప్రఖ్యాతలు సంపాదించారు. బాల నటిగా తన ప్రస్థానాన్ని స్థాపించిన ఆవేటి పూర్ణిమ... రంగస్థలం నటిగా  ఎన్నో నాటకాల్లో  నటించి ఎన్నో అవార్డులు సైతం పొందారు. సావిత్రి చిత్రాంగి  ప్రమీల చంద్రమతి మల్లమాంబ కమల వంటి నాయిక పాత్రలో ఆమె నట జీవితం లో  మైలురాళ్లుగా నిలిచాయి.

 

 ఎలమంచిలి హనుమంతరావు జననం : రేడియో హనుమంతరావు గా తెలుగు రాష్ట్ర రైతులకు సుపరిచితుడైన వ్యక్తి ఎలమంచిలి హనుమంతరావు. ఈయన 1938 మార్చి 1వ తేదీన జన్మించారు.  ఈయన రేడియో వ్యాఖ్యాతగా పనిచేస్తూ రైతులకు ఎంతగానో వ్యవసాయ సమాచారాన్ని అందించారు.

 

 నితీష్ కుమార్ జననం : బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 1951 మార్చి 1వ తేదీన జన్మించారు.

 

 వెలమల సిమన్న జననం : బహు గ్రంథ కర్త శతాధిక విమర్శనాత్మక వ్యాస రచయిత విమర్శకులు వినూత్న పరిశోధకులు ఆంధ్ర అధ్యాపకులు అయిన  ఆచార్య వెలమల సిమ్మన్న 1955 మార్చి 1వ తేదీన జన్మించారు. ఈయన  నిరంతరం నిర్విరామంగా సాహితీ కృషి వలుడు  ఆచార్య వెలమల సిమ్మన్న.

 

 

 కారుణ్య : తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో పాటలు పాడుతూ తన కంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న కారుణ్య పాడుతా తీయగా కార్యక్రమంలో విజేతగా నిలిచారు.కారుణ్య 1986 మార్చి 1వ తేదీన జన్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: