ఏపీ సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల ఫార్ములా బాగా వర్కౌట్ అవుతుంది. ఇప్పటికే రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఇక ఈ నిర్ణయం వల్ల టీడీపీకి జరగాల్సిన డ్యామేజ్ కూడా బాగానే జరిగింది. మూడు రాజధానులు వద్దు అమరావతి మాత్రమే కావాలంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊహించని షాకులే తగులుతున్నాయి.

 

అమరావతిలోనే మొత్తం రాజధాని ఉండాలని డిమాండ్ చేస్తున్న బాబుపై ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో బాగా వ్యతిరేకిత వచ్చింది. ముఖ్యంగా విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా వద్దంటున్న బాబుకు తాజాగా ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ప్రజా చైతన్య యాత్ర కోసమంటూ విశాఖ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టిన బాబుకు, వైసీపీ శ్రేణులు, ప్రజల నుంచి ఎంత ప్రతిఘటన ఎదురైందో తెలిసిందే.

 

విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన బాబుని అక్కడే ఐదు గంటల పాటు అడ్డగించి, మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళేలా చేశారు. అయితే వెనక్కి వెళ్ళిన బాబు ఏ మాత్రం తగ్గకుండా మళ్ళీ విశాఖ పర్యటనకు వస్తానని సవాల్ చేశారు. ఆ సవాల్‌కు తగ్గట్టుగానే బాబు, టీడీపీ శ్రేణులు మళ్ళీ విశాఖకు రావాలని వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఫ్లైట్‌లో కాకుండా రైలు లేదా రోడ్డు మార్గం ద్వారా విశాఖకు చేరుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

 

అయితే రోడ్డు మార్గంలో వస్తే మార్గమధ్యంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చంద్రబాబుతో పాటుగా విశాఖకు తరలే అవకాశాలుంటాయని, అప్పుడు చంద్రబాబు యాత్రను అడ్డుకోవడం వైసీపీ శ్రేణులకు సాధ్యం కాదని టీడీపీ వ్యూహంగా కనిపిస్తుంది. ఇదే సమయంలో బాబుకు తగ్గట్టుగానే వైసీపీ కూడా ప్రతి వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. బాబు ఎలా వచ్చిన అడ్డుకునేందుకు వైసీపీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. టీడీపీ ప్లాన్ బట్టి అప్పటికప్పుడు వైసీపీ వ్యూహం మార్చుకుని ముందుకెళ్ళేందుకు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా గాని చంద్రబాబుని మాత్రం ఉత్తరాంధ్రలో అడుగుపెట్టనివ్వకూడదని వైసీపీ ఫిక్స్ అయిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: