ఏపీలో జగన్ సునామీకి తెలుగుదేశం పార్టీ ఇంకా చాలాచోట్ల కోలుకోని సంగతి తెలిసిందే. బాబు ఏదో పైకి పోరాటాలు చేసి, హడావిడి చేస్తున్నారు తప్ప చాలా నియోజకవర్గాల్లో టీడీపీకి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ బాబు అవేమీ పట్టించుకోకుండా జగన్ మీద ప్రజల్లో వ్యతిరేకిత పెరిగిపోయింది, నెక్స్ట్ మాదే అధికారం అంటూ బీద అరుపులు అరుస్తున్నారు. అసలు ఓడిపోయాక పార్టీని బలోపేతం చేసుకోకుండా ఇలా చేయడం వల్ల, టీడీపీ చాలా చోట్ల కష్టాల్లో ఉండిపోయింది.

 

అలా టీడీపీ పరిస్థితి దారుణంగా వాటిల్లో విశాఖపట్నంలోని అరకు, అనకాపల్లి పార్లమెంట్‌లు కూడా ఉన్నాయి. ఈ రెండు చోట్ల టీడీపీ దిక్కు లేకుండా ఉంది. అసలు 2019 ఎన్నికల్లో టీడీపీకి కాస్తో కూస్తో పరువు నిలిపేలా చేసింది విశాఖనే. ఈ జిల్లాలో టీడీపీ నాలుగు అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది. అయితే ఆ సీట్లు కూడా నగరంలోనివి. రూరల్ ప్రాంతాల్లో మాత్రం వైసీపీ దుమ్ములేపింది. రూరల్ ప్రాంతాల్లో టీడీపీ మరి వీక్‌గా ఉంది. ఇలా అసలే వీక్‌గా ఉన్న టీడీపీకి జగన్ మూడు రాజధానులతో భారీ షాక్ ఇచ్చారు. ఫలితంగా టోటల్ వైజాగ్‌లోనే టీడీపీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక మాదిరి అయిపోయింది.

 

ముఖ్యంగా అనకాపల్లి, అరకు పార్లమెంట్‌ల్లో టీడీపీ కష్టాల్లో పడిపోయింది. పైగా మొన్న ఎన్నికల్లో అరకు నుంచి పోటీ చేసి ఓడిపోయిన కిషోర్ చంద్రదేవ్ పార్టీలో కనిపించడం లేదు. అరకు పార్లమెంట్ పరిధిలో ఉన్న పాలకొండ, కురుపాం, సాలూరు, పార్వతిపురం, పాడేరు, అరకు, రంపచోడవరం అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ చాలా వీక్‌గా ఉంది. అటు అనకాపల్లిలో పోటీ చేసి ఓడిపోయిన ఆడారి ఆనంద్ కుమార్ వైసీపీలో చేరడంతో, అక్కడ టీడీపీకి అండగా నిలిచే నాయకుడే లేకుండా పోయాడు. మొత్తానికైతే జగన్ దెబ్బకు అరకు, అనకాపల్లి ప్రాంతాల్లో టీడీపీకి నాయకుడే కరువయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: