ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఎన్నో వినూత్న పథకాలను ప్రవేశ పెడుతూ  తమదైన పాలన అందిస్తున్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ ఛార్జీలను పెంచుతూ వస్తోంది. ఇప్పటికే భారీగా ఆర్టీసీ చార్జీలు పెంచిన ప్రభుత్వం మరోవైపు మద్యం ధరలు కూడా పెంచుతుంది. ఇక మొన్నటికి మొన్న విద్యుత్ ఛార్జీలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే జగన్మోహన్ రెడ్డి సర్కార్ వరుస  ఛార్జీల పెంపుతో ప్రజలు కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది జగన్మోహన్ రెడ్డి   సర్కార్. 

 

 

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా పెట్రోల్ డీజిల్ పై ఏపీ సర్కార్ వ్యాట్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్ పై 31 శాతం మేర వ్యాట్ పెంచుతూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం..  డీజిల్ పై  22.75 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో పెట్రోల్ చార్జీలను భారీగా పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో లీటర్ పెట్రోల్ లీటర్ కి  75పైసలు పెరుగుతుండగా లీటర్ డీజిల్ కు  1.3 రూపాయలు పెరగనున్నది. ఈ మేరకు వాణిజ్య పన్నుల శాఖ శనివారం ఆదేశాలు జారీ చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ పై పెంచిన ఈ పన్నులు  మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి అంటూ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. 

 

 

 

 పెట్రోల్ డీజిల్ వ్యాట్ పెంపునకు సంబంధించి ఓ నోటిఫికేషన్ ను  విడుదల చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి  సర్కార్. అయితే అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరిగిపోతుండడంతో నే ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఈ  నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ పెంపు కు సంబంధించి కారణాలు ఏం చెప్పు పోతుంది అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే భారీ మొత్తంలో ఆర్టీసీ చార్జీలు పెంచిన ప్రభుత్వం మొన్నటికి మొన్న విద్యుత్ ఛార్జీలను కూడా పెంచుతుంది... మరోవైపు మద్యం ఛార్జీలను కూడా పెంచిన విషయం తెలిసిందే.. ఇక తాజాగా పెట్రోల్ డీజిల్ ధరలను కూడా పెంచడంతో ఇది సామాన్య ప్రజలకు కాస్త భారంగా మారనుంది. మరి దీనిపై ప్రజలు ఎలా స్పందిస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: