ఈ మధ్యకాలంలో జంతువులను పక్షులను పెంచుకోవడం ఒక ట్రెండ్ గా  మారిన విషయం తెలిసిందే. కొంతమంది జంతువులపై ప్రేమతో పెంచుకుంటే ఇంకొంతమంది స్టైల్ కోసం జంతువులను పక్షులను పెంచుకుంటూ ఉంటారు. ఇక జంతువులను పక్షులను పెంచుకుంటూ వాటిపైన అమితమైన ప్రేమను చూపిస్తూ ఉంటారు. మనుషులపై చూపించనంత ప్రేమని ఏకంగా జంతువులు పక్షుల పైన చూపిస్తూ ఉంటారు జంతు ప్రేమికులు. ఇక ముఖ్యంగా విదేశాల నుంచి ఎంతో  ఖర్చు చేసి మరీ తెప్పించుకుని ప్రేమగా పెంచుకుంటూ ఉంటారు. ఇక ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న జంతువులు పక్షులు కనిపించకుండా పోతే కంగారుపడిపోయి  ఎంతో హడావిడి చేస్తూ ఉంటారు. 

 

 

 తాజాగా ఇక్కడ ఇలాంటిదే జరిగింది. విదేశాల  నుంచి తెచ్చి ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న తన పక్షిని దొంగలు ఎత్తుకెళ్లారు. ఇక ఎంతో ప్రేమగా పెంచుకున్న పక్షి కనిపించకపోవడంతో ఆ వ్యక్తి కంగారుపడి  ఎంతో హడావిడి చేసేసాడు. దీంతో ఏం చేయాలో పాలుపోక... తాను  ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న  పక్షిని  వెతికి పెట్టాలంటూ పోలీసులను ఆశ్రయించాడు సదరు వ్యక్తి. ఈ ఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడెం కు చెందిన రామలింగేశ్వర రావు అనే వ్యక్తి.. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్నాడు. అయితే తాను విదేశాల నుంచి తెచ్చి ఎంతో ప్రేమగా కాక్ టేల్  పెంచుకుంటున్నాడు.  అయితే తాజాగా ఆ పక్షిని  దొంగలు ఎత్తుకెళ్లారు అంటూ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు సదరు వ్యక్తి. 

 

 

 ఇది ఆస్ట్రేలియన్ కాక్టెయిల్ పక్షి అని సదరు వ్యక్తి తెలిపాడు. ఆ పక్షిని ఎవరో ఎత్తుకు పోయారని... దయచేసి దానిని వెతికి పెట్టాలి అంటూ రామలింగేశ్వరరావు పోలీసులను కోరారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు ఎవరిమీదైనా అనుమానం వుందా అంటూ ప్రశ్నించారు. ఇక రామలింగేశ్వర రావు ఇంటి వద్ద చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు పోలీసులు. ఇక ఆ సీసీ కెమెరా లో నిక్షిప్తమై ఉన్న దృశ్యాలను ఆధారంగా చేసుకొని దొంగలను పట్టుకునేందుకు విచారణ చేస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: