రాజకీయంగా ఇబ్బంది పడుతున్న తెలుగుదేశం పార్టీకి ఈ వారం కాస్త కష్టంగానే గడిచింది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యాటన ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఊహించని విధంగా వచ్చిన వ్యతిరేకత చంద్రబాబు నాయుడు ని ఇబ్బంది పెట్టింది అనే చెప్పుకోవచ్చు. మూడు రాజధానులు అనే ప్రతిపాదనను ముందు నుంచి వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్ర పర్యతాలో ఊహించని షాక్ తగిలింది అనే చెప్పుకోవచ్చు. రాజకీయంగా ఈ పర్యటన ద్వారా కాస్త లబ్ది పొందాలి అని భావించిన ఆ పార్టీకి అక్కడి ప్రజలు షాక్ ఇచ్చారు. 

 

చంద్రబాబు రాకను అధికార పార్టీ కార్యకర్తలతో పాటుగా ప్రజలు కూడా అడ్డుకున్నారు. అందులో తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఉండటం తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టే పరిణామం గా చెప్పుకోవచ్చు. ఇక్కడ షాక్ తగలడం తో తెలుగుదేశం పార్టీ గవర్నర్ దగ్గరకు హైకోర్ట్ దగ్గరకు వెళ్ళింది. తమను అడ్డుకోవడం పై తెలుగుదేశం పార్టీ నేతలు గవర్నర్ కి ఫిర్యాదు చేసారు. హైకోర్ట్ లో శుక్రవారం లంచ్ మోషన్ పిటీషన్ కూడా దాఖలు చేయడం గమనార్హం. ఇక చంద్రబాబు మీద కోడి గుడ్లు, చెప్పులు వేయడాన్ని ఆ పార్టీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. 

 

చంద్రబాబు గో బ్యాక్ అంటూ అక్కడి ప్రజలు చేసిన నినాదాలు ఆ పార్టీని ఈ వారం చాలానే ఇబ్బంది పెట్టాయి. ఇప్పటికే ఆ పార్టీని రాజకీయ పరిణామాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఈ తరుణంలో రాజధాని అంశం మరింత ఇబ్బంది పెట్టింది అనే చెప్పుకోవచ్చు. దీని నుంచి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు బయటపడుతుంది అనేది చూడాలి. ఇక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ఎన్ని విమర్శలు చేసినా సరే... దీని నుంచి బయటపడటం అనేది చాలా అవసరం అంటున్నారు పరిశీలకులు కూడా. ఏ విధంగా చూసుకున్నా గత వారం కలిసి రాలేదు ఆ పార్టీ.

మరింత సమాచారం తెలుసుకోండి: