చింతచిగురు ను చూస్తే మన నోటిలో లాలాజలం ఊరుతుంది. అలాంటిది ఆ చింతచిగురు కాంబినేషన్ లో చికెన్ కర్రీ ను వండితే.. అబ్బా అలా అంటుంటేనే నోరు ఊరుతుంది కదా.. ఇప్పటికే మేకు అర్ధమయ్యి ఉంటుంది నేను ఏం చెప్పబోతున్నానో చింతచిగురు చికెన్ కర్రీ..

 

ఈ ఆదివారం టేస్టీ నాన్ వెజ్ ఐటమ్ ని డిఫరెంట్ గా ట్రై చేయండి. తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు తెలుసుకుందాం...

 

 

కావాల్సిన పదార్థాలు: చికెన్ - ½, చింత చిగురు - ½, కొబ్బరి తురుము - రెండు టీస్పూ్న్లు, కొత్తి మీర తరుగు - అరకప్పు, ధనియాల పొడి - టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, ఆవాలు - టీస్పూను, పుదీనా - ఒక కట్ట, ఉల్లిపాయ - ఒకటి, కారం - రెండు స్పూనులు, పసుపు, ఉప్పు, నూనె - సరిపడినంత, గరం మసాలా - టీ స్పూను. 

 

 

తయారు చేయు విధానాన్ని తెలుసుకుందాం..  చికెన్ కడిగి శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చింత చిగురు ఆకుల్ని కూడా కడిగి నీరు వార్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అన్ని కూరలు వండినట్టే కళాయిలో నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర వేయించాలి. ఉల్లి తరుగును వేసి వేయించాక చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి. తరువాత కొబ్బరి తురుము వేసి వేయించాలి. ఇప్పుడు పక్కన పెట్టుకుని చికెన్ ముక్కల్ని వేసి బాగా ఉడికించాలి. చికెన్ కూర బాగా ఉడికిపోయాక చింత చిగురును వేయాలి. ఓ అయిదు నిమిషాల పాటూ మీడియం మంట మీద ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. చివరల్లో గరం మసాలా చల్లి బాగా కలిపి స్టవ్ కట్టేయాలి. అంతే చింతచిగురు చికెన్ కర్రీ రెడీ.

మరింత సమాచారం తెలుసుకోండి: