తెలంగాణ రాజకీయాల్లో  హరీష్ రావు ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టిఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా... ట్రబుల్ షూటర్గా మంత్రి హరీష్ రావుకు  మంచి పేరు ఉంది. ఇక సిద్దిపేట నియోజకవర్గం నుంచి వరుసగా విజయ పరంపరను కొనసాగిస్తూ వస్తున్నారు హరీష్ రావు. హరీష్ రావు ఎక్కడ కాలు పెడితే అక్కడ విజయం సాధిస్తుందనే నమ్మకం అటు టిఆర్ఎస్ పార్టీలో కూడా ఉంది. అందుకే క్లిష్ట పరిస్థితుల్లో హరీష్ రావును  రంగంలోకి దింపి విజయం సాధిస్తూ ఉంటారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అయితే గత కొంత కాలం నుంచి టిఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు కు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు అనే విషయం తెలిసిందే. 

 

 

 టిఆర్ఎస్ ముఖ్య నేత అయిన హరీష్ రావుకు.. మంత్రి పదవి ఇవ్వడం లో కూడా ఎంతో జాప్యం జరిగింది. ఇక గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావ్ ఎవరూ ఊహించని విధంగా అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ కాలేశ్వరం ప్రాజెక్టు శరవేగంగా పూర్తి చేసినప్పటికీ... ఆ కాలేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమయ్యే సమయానికి హరీష్ రావు దూరంగానే ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇక రెండవ సారి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హరీష్ రావు ఆర్థిక శాఖామంత్రిగా పదవీ బాధ్యతలు అప్పజెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ఎలాంటి బాధ్యత అప్పజెప్పిన సమర్థవంతంగా నిర్వహించగల సత్తా హరీష్ రావు సొంతం అన్న విషయం తెలిసిందే. 

 

 

 ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రిగా కూడా మంత్రి హరీష్ రావు సమర్థవంతంగా దూసుకుపోతున్నారు. అయితే ఇంకొన్ని రోజుల్లో మొదటి సారి హరీష్ రావు తన చేతుల మీదుగా తెలంగాణ బడ్జెట్ ను  అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ నెల 8న జరిగే అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి హోదాలో మంత్రి హరీష్ రావు తన రాజకీయ జీవితం లోనే మొదటి సారి తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. కాగా  ఈ నెల 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా మొదటి రెండు రోజులు ఉభయ సభలకు సంబంధించి గవర్నర్ ప్రసంగం చేయనున్నట్లు తెలుస్తోంది. హరీష్ రావు ఏ పని చేసినా తనదైన మార్కు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. దీంతో ఈ బడ్జెట్లో ఎలాంటి సంస్కరణలు ఉండబోతున్నాయి అనేదానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. కాగా గతేడాది సీఎం కేసీఆర్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: