ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో రిలయన్స్‌ అధినేత ముకేశ్ అంబానీ సమావేశం అయిన విషయం తెలిసిందే. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్‌తో సమావేశమై రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల ఏర్పాటుపై చర్చించారుఅంబానీ తో పాటు ఆయన కుమారుడు అనంత్‌ అంబానీ.. రాజ్యసభ సభ్యుడు, పారిశ్రామిక వేత్త పరిమల్‌ నత్వానీ కూడా ఉన్నారు.

 

IHG

 

ఆయితే ఉన్నట్లుండి అంబానీకి మన రాష్ట్రం మీద ఎందుకు అంత ప్రేమ పుట్టుకొచ్చింది అన్నది అందరి ప్రశ్న. కానీ అంతా అనుకుంటునది ఏమంటే ఏపీలో పెట్టుబడులపై జగన్ అంబానీతో చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఏర్పాటైన పరిశ్రమలతో పాటూ.. రాబోయే రోజుల్లో ఏర్పాటు చేసే ప్రాజెక్టులపై ప్రముఖంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అంబానీ అతనిని తొలిసారి కలిశారు. భేటీకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

IHG

 

కానీ  సీఎం జగన్ - ముకేష్ అంబానీల సమవేశానికి ప్రభుత్వ అధికారులు ఎవరూ రాలేదు. కావున ఇది పూర్తిగా ప్రైవేటు భేటి అని తెలిసింది. ఏప్రిల్ లో ఖాళీ కాబోయే రాజ్యసభ సీట్లలో నాలుగు వైసీపీ దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. నేపథ్యంలోనే పరిమల్ నాత్వానీని ఏపీ కోటాలో వైసీపీ తరుఫున రాజ్యసభకు పంపడానికి నామినేట్ చేయాలని సీఎం జగన్ ను కోరడానికే ముఖేష్ అంబానీ వచ్చాడని సమాచారం.

 

బీజేపీ జార్ఖండ్ లో దారుణంగా ఓడిపోవడంతో ఈసారి అక్కడి నుంచి నాథ్వానీ రాజ్యసభకు వెళ్లడం కష్టం. కాబట్టి ముకేష్ అంబానీయే కదిలివచ్చి సీఎం జగన్ ను ఒక రాజ్యసభ సీటు ఇవ్వాలని కోరినట్టు ప్రచారం సాగుతోంది. అయితే బీజేపి తరపున అంబానీ మాట్లాడడానికి వచ్చాడంటే…. మూడు రాజధానుల విషయంలో మోడీ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు లెక్క. ఇక విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని అయిన తరువాత అంబానీ కచ్చితంగా పెట్టుబడులు మరియు పరిశ్రమలు స్థాపిస్తాడని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: