అవును.. సాక్షాత్తూ ట్రంప్, భారత్ పర్యటన తరువాత పలికిన మాటలివి. అమెరికాలోని సౌత్ కరోలినా బహిరంగ సభ వేదికగా.. ఈ మాటలు అన్నారు. అక్కడ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చెబుతారా అని ఆసక్తిగా చూస్తున్న జనానికి అతను గట్టి ఘలక్ ఇచ్చారు. చాలా క్యాజువల్ గా స్పీచ్ మొదలు పెట్టిన ట్రంప్, ముందుగా తన మద్దతుదారులకు అనుకూలంగా మాట్లాడుతూ, ఈ కామెంట్ చేశారు. 

 

IHG

 

అదేమంటే, "ఇక్కడ ఇంత మందిని చూస్తున్నా, నాకు పెద్దగా ఆనందం, ఆశ్చర్యం కలగట్లేదు. ఎందుకో తెలుసా.. భారత్, అహ్మదాబాద్‌లోని మోతేరా స్టేడియంలో ఇంతకంటే భారీ సంఖ్యలో వచ్చిన ప్రజల్ని చుసిన తరువాత, మీరు అతి కొద్ది మందిగా.. నాకు తోస్తుంది." అన్నారు. దాంతో, అక్కడున్న ప్రజలంతా ఆశ్చర్యపోయారు. ఇకపై ఎక్కడకు వెళ్లినా... ప్రజల్ని చూసినప్పుడు తనకు పెద్దగా ఎక్సై‌ట్‌మెంట్ ఫీల్ కలగదేమో అన్నారు ట్రంప్. 

 

అవును. ట్రంప్ మన ఇండియా వచ్చినప్పుడు, మోతేరా స్టేడియంలో 1,29,000 మందికి పైగా ఉన్నారు. అంతంత మంది జనాభా... అమెరికాలో సభలకు సహజంగా వెళ్లారు. సుమారుగా ఒక ఐదారు వేల మంది వస్తే అక్కడ గొప్ప విషయం. అయితే ట్రంప్, ఊహించిన దానికంటే, ఇక్కడ అతనికి అతిధి సత్కారాలు లభించాయి. లక్షల జనం అతని ప్రసంగం వీక్షించారు. ఇది అతని జీవితంలోనే అతి గొప్ప అతిధి సత్కారం కావచ్చు.

 

IHG

 

అందుకే ట్రంప్ భారత్ తో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి, సరదాగా ఈ వ్యాఖ్యలు చేసారు. ఇండియాలో అంత మంది జనాభా నుంచీ స్వాగత సత్కారాలు, ప్రశంసలు, పొగడ్తలు, విజిల్స్ వంటివి అందుకున్న ట్రంప్‌కి ఇప్పుడు తమ దేశంలో బహిరంగ సభలు చాలా చిన్నవిగా తోస్తున్నవి. మోతేరా స్టేడియంలోని సభలో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పాల్గొన్న ట్రంప్... ఇండియన్స్ అమితంగా ప్రేమించే నేతగా మోదీని ఈ సందర్భంగా ప్రశంసించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: