ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడు ఒక్కో దేశంలో ప్రజలకు నిద్ర పట్టకుండా చేస్తుంది.  చైనాలో ప్రబలిన కరోనా ఇప్పుడు వివిధ దేశాల్లో తన ప్రభావాన్ని చూపిస్తుంది.  కరోనా వైరస్‌ (కోవిడ్-19) విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్న భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాదకర ఈ వైరస్ దేశంలోకి ప్రవేశించకుండా ఉండేందుకు పలు చర్యలు తీసుకుంటోంది.  ఇరాన్ పౌరులు దేశంలోకి అడుగుపెట్టకుండా వీసాల జారీ ప్రక్రియను నిలిపివేసింది. చైనా తర్వాత కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నది ఇరాన్‌లోనే. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

 

వాషింగ్టన్ లో శనివారం వైరస్ బారినపడి, ఐసొలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి కన్నుమూశాడని ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకూ 66 మందికి వ్యాధి సోకిందని వీరంతా ఏదో ఒక సమయంలో చైనా, దక్షిణ కొరియా తదితర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారేనని తెలిపింది.  ప్రపంచ వ్యాప్తంగా 57 దేశాలకు వ్యాధి విస్తరించగా ఆస్ట్రేలియాలో తొలి మరణం నమోదు కావడంతో ఆ దేశ యంత్రాంగం హడలి పోతోంది. కరోనా వైరస్‌ బారిన పడిన 121 మంది అస్ట్రేలియన్లను ఇటీవల ఆ దేశం తీసుకు వెళ్లింది.

 

పెర్త్‌లోని ఓ ప్రత్యేక ఆసుపత్రిలో వారికి వైద్య సేవలు అందిస్తోంది. వీరిలో ఒకరు చనిపోగా మరో 120 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. కరోనా తో ఓ వ్యక్తి చనిపోయాడని తెలియగానే ఆస్ట్రేలియాలో జనాలకు భయ కంపితులు అవుతున్నారు.  ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నా.. కరోనా వైరస్ ప్రబలుతూనే ఉంది.  ఇక కరోనా బారిన పడి చైనాలో ఇప్పటి వరకు 2,870 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యాధి ఇరాన్‌, దక్షిణ కొరియా దేశాలను వణికిస్తోంది.  అయితే కరోనా వైరస్ తో ఇటీవల కేరళాకు చెందిన ఓ వ్యక్తి మరణించారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: