ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ సార్వత్రిక ఎన్నికలకు ముందు తన పాదయాత్రలో కొన్ని హామీలు ఇచ్చారు. ఇప్పటివరకు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటి మాట తప్పకుండా నెరవేరుస్తూ వచ్చిన ఆయన అప్పుడే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పెన్షన్ మాత్రం ఆగదని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినట్లుగా జగన్ తన మాట మీద నిలబడి పెన్షన్ ఆపకుండా ఇస్తున్నాడు.

 

IHG

 

అయితే పెన్షన్ విధానం వలన రాష్ట్ర ప్రభుత్వంకు ప్రతి నెల 1320 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, ఇప్పటివరకు 55 లక్షల మంది పెన్షన్ కు అర్హులు ఉండగా నెల నుండి మరో ఐదు లక్షల మంది అదనంగా. యాడ్ కాబోతున్నారు కాబట్టి మొత్తం మీద నెల నుండి 60 లక్షల మందికి పెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది.

 

అయితే కొత్తగా 5 లక్షల మందికి గాను ప్రభుత్వానికి అదనంగా 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. సంవత్సరం యొక్క బడ్జెట్ ను మార్చి నెలలో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఇందులో 10 శాతం బడ్జెట్ కేవలం పెన్షన్ కోసమే వినియోగించబోతున్నారని తెలుస్తోంది. అయితే ఇక్కడ కేవలం ముసలి వాళ్లకు మాత్రమే పెన్షన్ ఇవ్వడం లేదు. చాలా రకాల పెన్షన్లను ఏపీ ప్రభుత్వం అందిస్తోంది.

 

IHG

 

ముసలి, వితంతు, ఒంటరి మహిళలు, చేనేత, కార్మికులకు రూ. 2250

 

చర్మకారులు, డప్పు కళాకారులు, హిజ్రాలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి రూ. 3000

 

తలసేమియా, బోదకాలు, డయాలసిస్ వారికీ రూ. 5000

 

పక్షవాతం, రక్తహీనతతో బాధపడేవారికి రూ. 10000 చొప్పున ప్రభుత్వం నెలనెలా సహాయం అందిస్తోంది.

 

IHG

 

ప్రభుత్వ ఖజానాలో డబ్బులేకపోయినా, పెన్షన్ విధానం మాత్రం ఆగకూడదని ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించింది. ఇలా అన్ని రోగాలతో బాధపడే వారి గురించి ఆలోచించి వారి జీవితానికి చేయూతనిస్తున్న జగన్ ను జనాలు ఎమోషనల్ అయిపోయి చేతులెత్తి మొక్కేస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: