రెండేళ్ళ చిన్నారి తను. కల్లాకపటం తెలియని వయస్సు. ఏమీ తెలియని ఆ చిన్నారి ఆడుకుంటున్నాడు. ఆడుకుంటూ ఉంటున్న సమయం లో విషాదం చోటు చేసుకుంది. అందరూ పనుల్లో మునిగి పోవడం వల్ల సరిగ్గా ఆ సమయం ని గమనించక పోవడమే ఆ దు:స్థితి కి చోటు చేసుకుంది. అయితే ఆ చిన్నారి తక్షణమే మరణించడం నిజంగా బాధాకరమే.
 
IHG
 
అయితే ఆ బాలుడి వివరాలు చూస్తే ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా కల్హేర్‌ మండలం బీబీపేట్‌ లో ఈ విషాదం చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన కుర్మ కవిత, నరసిమ్హులు దంపతుల కుమారుడు సాకేత్. సాకేత్ కి రెండు సంవత్సరాలు. ఇంక చిన్న అడుగులు వేస్తూ ఆడుకుంటూ ఉంటున్నాడు. అయితే ఆడుకుంటూ ఉంటుండగా నీళ్ళ బకేట్ దగ్గర కి వెళ్ళాడు.
 
 
పొరపాటున అందులో తలకిందులు గా పడి పోయాడు సాకేత్. ఆడుతూ పాడుతూ ఉంటుండగా తెలియని వయస్సు ప్రాణం పోవడం నిజంగా దురదృష్టం. తల్లి దండ్రుల కి ఒక్కగాని ఒక్క గారాల కొడుకు సాకేత్. అయితే ఇంట్లో ఎవరి పనుల్లో వారు బిజీ గా ఉండి పోవడం వల్ల ఈ విషయాన్ని గమనిచ లేక పోయారు ఇంట్లో కుటుంబ సభ్యులు. వెంటనే ఆసుపత్రి కి తీసుకుని వెళ్ళారు. కానీ ప్రాణం అప్పటికే పోయినట్లు చెప్పేసారు డాక్టర్లు.
 
 
IHG
 
అయితే ఆడుతూ పాడుతూ అల్లారు ముద్దుగా పెరిగిన చిన్నారి దూరం అయ్యేటప్పటికీ తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు. దు:ఖం తో కూరుకు పోయారు కుటుంబికులు. మరి ఇంక లాభం ఏమిటి కన్నీరు పెట్టుకుని. అప్రమత్తంగా ఉంటూ చిన్నారుల పై దృష్టి పెట్టడం ఎంతో ముఖ్యం. కానీ ఈ చిన్నారి పరిస్థితి ఎంతో దారుణం.
 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: