ఈ మద్య తెలంగాణ పోలీసులు దూకుడు పెంచారు.  క్రైమ్ విషయంలో తమదైన శైలిలో ఇన్వెస్టిగేషన్ చేస్తూ  నేరగాళ్ల ఆట కట్టిస్తున్నారు. ఇటీవల మహిళలపై జరుగుతున్న లైంగిక వేదింపుల విషయంలో సిరియస్ గా వ్యవహరిస్తున్నారు.  ఇటీవల వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచార, హత్య కేసులు నలుగురు నింధితులను 24 గంటల్లోనే అరెస్ట్ చేశారు.  అయితే సీన్ ఆఫ్ యాక్షన్ సందర్భంగా నలుగురు నింధితులు పోలీస్ లను ఎటాక్ చేస్తే వారి నుంచి రక్షణ కోసం ఎన్ కౌంటర్ చేశారు.  దాంతో తెలంగాణ పోలీసులపై దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేశారు.   ఇటీవల తెలంగాణలో కొంత మంది మహిళలపై అత్యాచార, హత్య కేసుల్లో పోలీసులు చాక చక్యంగా నింధితులను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పరిచారు.

 

దాంతో ఫాస్ట్ కోర్టు లో వారికి ఉరిశిక్ష పడింది.  ఇలా తెలంగాణలో పోలీసుల ఫ్రెండీ గా వ్యవహరిస్తూ ప్రజల హృదయాలు గెల్చుకుంటున్నారు.  తాజాగా తెలంగాణ పోలీసులు మరోసారి తమ మంచి మనసు చాటుకోవడమే కాదు పదకొండ మంది చిన్నారులకు ప్రాణాలకు హాని కలగకుండా రక్షణగా వారిని కాపాడారు. పిల్లల్ని అక్రమంగా తరలిస్తున్న గ్యాంగ్ ని అరెస్ట్ చేశారు.  ఎల్బీనగర్‌ పోలీసు స్టేషన్‌ సమీపంలో ఓ బస్సులో కొందరు చిన్నారులు అనుమానాస్పదంగా కనపడడంతో ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు వారిని రక్షించారు.'ఎల్బీనగర్‌ ఎక్స్ రోడ్‌ వద్ద ఓ బస్సులో చిన్నారులు ఉన్న విషయాన్ని జిల్లా బాలల సంరక్షణ శాఖ అధికారులు గుర్తించారు. 

 

అయితే కాపాడిన చిన్నారులను  సైదాబాద్‌లోని  శిబిరానికి పంపారు. ఆ చిన్నారులను ఛత్తీస్‌గఢ్ నుంచి కొందరు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. వారితో కూలీ పనులు చేయించాలనుకున్నారు' అని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్ మీడియాకు తెలిపారు.  దేశంలో ఇలా ఎంతో మంది చిన్నారులను కొంత మంది దుర్మార్గులు అక్రమంగా తరలిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఇది ఒక మాఫియాగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: