దేశంలో ప్రశాంత్ కిషోర్ అంటే తెలియని వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు.  2014లో మోడీ ఎన్నికల ప్రచార నిర్వహణ బాధ్యతలు చేపట్టిన తరువాత అయన వెలుగులోకి వచ్చారు.  మోడీ ఎన్నికల నిర్వహణ అనంతరం యూపీలో కాంగ్రెస్ తరపున ప్రచారం నిర్వహించినా లాభం లేకపోయింది.  ఆ తరువాత వరసగా అనేక రాష్ట్రాల్లో ప్రశాంత్ కిషోర్ ఎన్నికలప్రచార నిర్వహణ బాధ్యతలు తీసుకొని అన్ని రాష్ట్రాల్లో విజయం సాధిస్తూ వస్తున్నారు.  


ఆంధ్రప్రదేశ్ లో వైకాపాకు, ఢిల్లీలో ఆప్ కు ఎన్నికల ప్రచార నిర్వహణ బాధ్యతలు నిర్వహించి విజయం సాధించారు ప్రశాంత్ కిషోర్.  అయితే, బీహార్ లో నితీష్ కుమార్ పార్టీ జెడియూ కు ఉపాధ్యక్షుడిగా ఉన్న ప్రశాంత్ ఆ తరువాత పార్టీలో ఉంటూనే బీజేపీ ని విమర్శించడం. పార్టీలో ఉంటూనే కేంద్రం తీసుకొచ్చిన సిఏఏ ను విమర్శించడం చేస్తున్నారు.  దీంతో  ప్రశాంత్ పై విమర్శలు వచ్చాయి.  


ప్రశాంత్ పార్టీలో ఉంటె పార్టీకి ఇబ్బంది అవుతుందని భావించిన నితీష్ ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించారు.  అయితే, ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ కు ఎన్నికల ప్రచార నిర్వహణ చేపట్టబోతున్నారు. మమత బెనర్జీ తరపున ప్రచారం నిర్వహించబోతున్నారు.  దీంతో ఆమె పీకేకు ఓ ఆఫర్ ఇచ్చింది.  అదేమంటే ప్రశాంత్ కిషోర్ కు రాజ్యసభకు పంపించాలని అనుకుంది.  


అనుకున్నట్టుగా ప్రశాంత్ కిషోర్ అఫర్ ఇచ్చింది.  కానీ, ఆ అఫర్ ను ప్రశాంత్ సున్నితంగా తిరస్కరించారట.  దీనికి కారణం ఉన్నది.  అదేమంటే, జేడీయూతో చేతులు కలిపి తప్పు చేసిన ప్రశాంత్ మరలా ఇప్పుడు మరో రాజకీయ పార్టీతో చేతులు కలిపి తప్పు చేయకూడదు అని అనుకున్నాడు.  అందుకే ఆ పార్టీకి దూరంగా ఉండాలని అనుకుంటున్నారు.  రాజకీయ పార్టీలకు దూరంగా ఉంది వృత్తి పరంగా మాత్రమే దగ్గరగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.  పైగా బీహార్ లో అయన బీహార్ బాత్ కి అనే ప్రోగ్రాం చేస్తున్నాడు.  దీనిద్వారా ప్రజల్లోకి వెళ్లి బలపడాలని అనుకుంటున్నాడు పీకే.  

మరింత సమాచారం తెలుసుకోండి: