సీఏఏ అనుకూల, ప్రతికూల వర్గాల మధ్య జరిగిన అల్లర్లు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.  ఢిల్లీలో జరిగిన అల్లర్ల వల్ల చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు దాదాపు 50 మంది చనిపోయారు. ఢిల్లీ అల్లర్లలో ఒక వర్గం వాళ్లు మరో వర్గం మీద దాడి చేస్తున్నారు.  350మందికి పైగా గాయపడ్డారని వైద్యులు ప్రకటించారు. ఆదివారం రాత్రి నుంచి ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.  ఈశాన్య ఢిల్లీని ఉన్మానుదుల సర్వనాశనం చేశారు. బ్రిపూర్ కార్ పార్కింగ్ ఏరియా మొత్తం ధ్వంసమైంది. పరిస్థితులను సాధారణ స్థాయికి తీసుకొచ్చేందుకు పోలీసుల తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

 

నిరసనకారులు ముస్లింలను గుర్తించకుండా ఉండేందుకు వారికి మా తలపాగాలను ఇచ్చాం. మేం కాపాడిన వారిలో మహిళలు మరియు పిల్లలు కూడా ఉన్నారు. మొదట వారిని తీసుకెళ్లి.. ఆ తర్వాత పురుషులను తీసుకువెళ్ళాం’’ అని మొహిందర్ సింగ్ తెలిపారు. . శుక్రవారం ప్రార్థనల సందర్భంగా అల్లర్ల ప్రాంతంలో పోలీసులు పర్యటించారు. పరిస్థితులను సమీక్షించారు. ఢిల్లీ పోలీస్ చీఫ్ ఎస్ఎన్ శ్రీవాస్తవ నేతృత్వంలోని పోలీసు బృందాలు హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో పర్యటించి.. స్థానికులకు ధైర్యం చెప్పాయి.  తాజాగా ఢిల్లీ అల్లర్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, రాజకీయ నేతల రెచ్చగొట్టే తీరు వల్లే ఢిల్లీలో హింసాత్మక ఘటనలకు కారణమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. 

 

ఈ రోజు హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ...  పాక్‌, బంగ్లా నుంచి చొరబాటుదారులు అధికమయ్యారని ఆయన తెలిపారు.  కొంత మంది స్వార్థ శక్తులు ఈ అల్లర్లకు పాల్పపడి ఎంతో మంది అమాయకుల ప్రాణాలు తీశారు.  వారు ఇక్కడ విధ్వంసాలు సృష్టిస్తున్నారని చెప్పారు. కేంద్రంలో  నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక ఎన్నో గొప్ప నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. దేశంలో పెద్ద నోట్ల రద్దు, జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌-370 రద్దు, జీఎస్టీ వంటి కీలక నిర్ణయాలను తీసుకున్నారని వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: