ఏపీ రాజధాని అమరావతిలోని భూముల వ్యవహారంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న వ్యవహారం రాష్ట్రంలో పెద్ద కలకలం రేపింది. దీనిపై సి డి మరియు సిట్ టీం విస్తృతంగా విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. అయితే విచారణకు సంబంధించి రాజధానిలో భూముల వ్యవహారంలో పాత్రధారులైన వ్యక్తుల ఇళ్లపై సిఐడి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది తెలుగుదేశం పార్టీ నేతల సంబంధీతుల ఇళ్లలో సోదాలు జరిగాయి.

 

అయితే లిస్టులో మరి కొంతమంది పెద్ద వారి పేర్లు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే క్రమంలో దాడుల నుంచి తప్పించుకునేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు పరారీలో ఉన్నట్లు కూడా వార్తలు వస్తూ ఉండడం గమనార్హం.

 

IHG

 

ఒక టిడిపి సీనియర్ నేత ప్రస్తుతం పరారీలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ఆయనే నన్నపనేని లక్ష్మీనారాయణ. నన్నపనేని లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీ హయాంలో ఏజీ గా పనిచేసిన దమ్మాలపాటి శ్రీనివాస్ కు సొంత మేనమామ. ఇంకా ఇక్కడ ఆసక్తి రేపుతున్న విషయం ఏమిటంటే లక్ష్మీనారాయణ తనయుడు సీతారామరాజు తెలుగుదేశం పార్టీ హయాంలో పోలవరం సబ్ కాంట్రాక్టర్ లలో ఒకరిని తెలుస్తోంది. ఇప్పుడు వీరి ఇళ్ళల్లో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం రాగానే లక్ష్మీనారాయణ తన ఇళ్లకు తాళాలు వేసుకుని మాయమైనట్లు వార్తలు వస్తున్నాయి.

 

IHG

 

తెలుగుదేశం పార్టీకి చెందిన మరో కీలక నేత మరియు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బంధువుల ఇళ్లల్లో కూడా సిఐడి అధికారులు సోదాలు జరిగాయి. అయితే మాజీ మంత్రి ఇంట్లోనే సోదాలు జరగాల్సి ఉందని సమాచారం ఉంది. తెలుగుదేశం నేతలు పరారీలో ఉన్నారని- సెర్చ్ వారెంట్లు జారీ చేసినట్టుగా - వారి ఇళ్లలో సోదాలకు కూడా నోటీసులు జారీ చేసి - తలుపులకు అతికించినట్టుగా అధికారులు  పేర్కొన్నారు. వీరంతా అమరావతి ప్రాంతంలో రాజధాని రాకముందే భారీ ఎత్తున భూములు కొనుగోలు చేశారని అభియోగాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు వారు కనపడకపోతుండేసరికి కొత్త అనుమానాలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: