ఈ మధ్యకాలంలో రాజకీయాల్లోకి వచ్చిన కొంతమంది సినీ ప్రముఖులు రాజకీయాల్లో  ఎన్నో చిత్రవిచిత్రాలు చేస్తున్నారు.గతంలో  రాజకీయాల్లోకి వచ్చినా ప్రకాష్ రాజకీయాల్లో చేరడానికి ఎన్నో పిల్లిమొగ్గలు వేశారు కానీ ఆ తర్వాత మాత్రం... రాజకీయాల్లో బొక్క బోర్లా పడి పడి పోయారు. కానీ కాస్త సెలబ్రిటీ ఇమేజ్ వుండడంతో అలాగే రాజకీయాల్లో కొనసాగుతూ  వస్తున్నారు. ఇక ఆ తర్వాత తమిళనాడులో కొత్త పార్టీని స్థాపించి రాజకీయాల్లో రాణించాలని అడుగుపెట్టారు  విలక్షణ నటుడు కమల్ హాసన్... గతంలో జరిగిన ఎన్నికల్లో కమలహాసన్ కనీసం డిపాజిట్లు కూడా దక్కక  ఘోర పరాజయాన్ని మూట కట్టుకున్నాడు. 

 


 అయితే రాబోయే ఎన్నికల్లో ఎక్కువ గెలవాలని దృఢ నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలోనే మద్దతు కోసం రజనీకాంత్ ను సంప్రదించగా రజనీకాంత్ ఆలోచనా ధోరణి కమల్ హాసన్ ఆలోచనా ధోరణే వేరు వేరు కావడంతో రజనీకాంత్ కమల్ హాసన్ తో కలిసి నడుస్తానని చెప్పినప్పటికీ ఆ తర్వాత మద్దతు ఉపసంహరించుకున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు చిత్రవిచిత్ర ప్రయత్నాలు చేస్తున్నారు కమలహాసన్. గతంలో ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రివాల్  వివిధ హామీలతో మహిళల మనసును గెలుచుకొని ఓట్లు సంపాదించినట్లే ప్రస్తుతం కమల్ హాసన్ కూడా చేయాలని ఓ హామీని  తెరమీదికి తెచ్చారు. 


 ఇంట్లో పనిచేసే మహిళలందరికీ... నెలసరి వేతనం ఇవ్వాలని అంటూ  కమల్ హాసన్ తో ఓ హామీ  తీసుకొచ్చారు. తాను అధికారంలోకి వస్తే  ఇంట్లో పనిచేసే గృహిణులు అందరికీ నెలసరి వేతనం ఇస్తాను అంటే కమల్ హాసన్  తెలిపారు  అయితే దీనిపై రాజకీయ విశ్లేషకులు సెటైర్లు వేస్తున్నారు. భార్య భర్తల బంధం అనేది డబ్బు తో కూడుకున్నది కాదని అది ఎంతో అన్యోన్యంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కేవలం కూలీలు ఉద్యోగులు మాత్రమే పని చేసి వేతనం తీసుకుంటారు. భర్త కోసం ఇంటి కోసం పనిచేసిన భార్య ఎప్పుడూ దానిని కూలి పనిగా వేతనం  తీసుకోవడానికి ఇష్టపడదు  అంటూ రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. ప్రతిరోజు మహిళలకు పడే కష్టాన్ని మెచ్చుకుంటే పర్వాలేదు కానీ మహిళల కష్టానికి డబ్బుతో వెలకట్టలనుకోవడం తప్పు అంటున్నారు. మహిళల ఓట్లు ఆకర్షించడానికి ఇలాంటి పిచ్చి పిచ్చి హామీలు  ఇస్తే మహిళల ఓట్లు ఎలా పడతాయి ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: