ఇపుడిదే విషయమై రాష్ట్ర రాజకీయాల్లో విపరీతమైన చర్చ జరుగుతోంది.  పారిశ్రామిక ధిగ్గజం, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అమరావతి వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలుస్తాడని ఎవరూ కలలో కూడా ఊహించలేదు. అలాంటిది వీళ్ళద్దరి భేటి దాదాపు 2 గంటలు జరగటం పెద్ద సంచలనంగా మారింది. సరే వీళ్ళద్దరి భేటిలో ఏం జరిగిందనే విషయంలో ఎవరికి వారుగా ఊహాగానాలతో చెలరేగిపోతున్నారు. కానీ అసలు వీళ్ళ భేటి వెనుక చక్రం తిప్పిందెవరు ?

 

ఎవరంటే జగన్ కు అంత్యత సన్నిహితుడైన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డే అనటంలో సందేహం లేదు. మార్చి 9వ తేదీతో రాజ్యసభ  టర్మ్ ముగిసిపోతున్న పరిమళ్ ధీరజ్ నత్వానీ కన్ను ఏపి మీద పడింది. ఇప్పటికే రెండుసార్లు రాజ్యసభ ఎంపి అయిన నత్వానీ మూడోసారి రాజ్యసభకు వెళ్ళటానికి ఉత్తరాధిలోని బిజెపి పాలిత రాష్ట్రాల్లో అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అందుకనే ఆయన కన్ను ఏపి మీద పడింది.

 

ఎందుకంటే ఏపి నుండి  ఏకంగా నాలుగు సీట్లు ఖాళీ అవబోతున్నాయి. అందులోను మొత్త సీట్లన్నీ వైసిపికే దక్కుతున్నాయి. కాబట్టి ఒక సీటును అడిగితే వచ్చే అవకాశం ఉందని నత్వానీ గ్రహించాడు. అందుకనే ముందుగా ఈ విషయాన్ని ఆయన విజయసాయిరెడ్డి దగ్గర కదిపాడు. నత్వానీకి ఒక రాజ్యసభ స్ధానం ఇవ్వటం వల్ల ఏపికి వచ్చే లాభమేంటనే విషయం కూడా ప్రస్తావన జరిగింది.

 

ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెళితే ఉభయులకు అన్నీ విధాల లాభమని ఇద్దరు ఓ అంగీకారానికి వచ్చారు. దాంతో అదే విషయాన్ని నత్వానీ మాటగా జగన్ దగ్గర విజయసాయి ప్రస్తావించాడు. ఇక్కడ నత్వాని అంటే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీయే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పైగా విజయసాయితో మాట్లాడేముందే ఇదే విషయాన్ని ముఖేష్ తో నత్వానీ మాట్లాడుకున్నాడు. ఒక పార్టీ తరపున రాజ్యసభ సీటు కోరుకుంటున్నపుడు వాళ్ళు కూడా ఏదో ఒకటి అడుగుతారు కదా.

 

ఇక్కడ జరిగిందదే. నత్వానీని రాజ్యసభ ఎంపిని చేయటం ముఖేష్ కు ఎంత అవసరమో ఏపికి పెట్టుబడులు రావటం కూడా జగన్ కు అంతే అవసరం. ఈ రెండు విషయాల్లో ముఖేష్ తరపున నత్వానీ, జగన్ తరపున విజయసాయి మాట్లాడుకుని డీల్ ఫైనల్ చేసుకున్నారు. ఆ తర్వాతే జగన్-ముఖేష్ భేటికి ముహూర్తం కుదిరింది. ఎలాగూ నత్వానీకి ఓ రాజ్యసభ ఎంపి సీటును కేటాయించమని ఢిల్లీ పర్యటనలో స్వయంగా అమిత్ షా నే జగన్ ను అడిగున్నాడు. జగన్ గనుక ఓకే చెప్పేస్తే ఇటు నరేంద్రమోడి, అమిత్ షా, ముఖేష్ లను సంతృప్తి పరిచినట్లవుతుంది. అటు రాష్ట్రానికి పెట్టుబడులు సాధించినట్లూ అవుతుంది. చూశారా జగన్ తరపున విజయసాయిరెడ్డి ఎంత చక్రం తిప్పారో ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: