తెలుగులో పత్రికలకు ఇప్పుడు రోజులు ఏమాత్రం బాగా లేవు. నిర్వహణ ఖర్చులు పెరిగిపోయాయి. ఆదాయం తగ్గిపోయింది. డిజిటల్ మీడియా దూసుకొస్తోంది. అందుకే ఇలాంటి ఇబ్బందులతో పత్రికలు మూతబడే రోజులు వస్తున్నాయి. తాజాగా తెలుగులో ఓ పత్రిక మూతపడే అవకాశం కనిపిస్తోంది. ఓ కమ్యూనిస్టు ఛానల్ నడిపిస్తున్న ఆ పత్రిక ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఉందని తెలుస్తోంది.

 

 

ఇక దాన్ని మూత వేయడం తప్ప యాజమాన్యానికి ఎలాంటి ఆప్షన్ లేదన్న టాక్ వినిపిస్తోంది. అయితే అదే పత్రిక యాజమాన్యంలో ఓ టీవీ ఛానల్ కూడా నడుస్తోంది. విచిత్రం ఏంటంటే.. టీవీ ఛానల్ కోసం ప్రజల నుంచిచందాలు పోగు చేశారు కూడా.. అంతే కాదు.. దాన్ని ఇటీవల అమ్మేశారు.. అలా అమ్మగా వచ్చిన డబ్బు ఉన్నా.. ఇప్పుడు పత్రికను కూడా క్లోజ్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే ఆ పత్రికలో పనిచేసే చాలా మంది సబ్ ఎడిటర్లకు గుడ్ బై చెప్పేశారు.

 

 

ఇక ఇప్పుడు కొందరు రిపోర్టర్లకు కూడా గుడ్ బై చెబుతున్నారట. విచిత్రం ఏంటంటే.. ఆ కమ్యూనిస్టు పార్టీ నిరంతరం యూనియన్లకు మద్దతుగా, కార్మిక హక్కులకు మద్దతుగా మాట్లాడుతుంటుంది. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే నినాదంతో నడిచే ఆ సిద్ధాంత పత్రికకు ఇప్పుడు ఎక్కడలేని కష్టాలు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే మరో వాదన ప్రకారం పత్రికను మూసేయరని.. కాకపోతే.. ఖర్చులు బాగా తగ్గించుకుని.. లో ప్రొఫైల్ లో నడిపిస్తారని అంటున్నారు.

 

 

ఏదేమైనా ఓ పత్రిక మూతబడటం అంటే ఓ వాయిస్ క్లోజ్ కావడమే. ప్రజాస్వామ్యంలో ఎన్ని పత్రికలు ఎన్ని మీడియాలు ఉంటే అంత మంచిది. కానీ ఇవి పత్రికలు రోజులు కాకుండా పోయాయి. మహా మహా పత్రికలే తమ ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పత్రిక మూతబడకుండా నడవాలని ఏపీ హెరాల్డ్ కోరుకుంటోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: