జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏదైనా రికార్డు స్థాయిలోనే పనులు చేస్తున్నారు. అంతకముందు ఏ ప్రభుత్వాలు, ఏ సీఎం చేయని విధంగా, ఎవరు ఊహించని విధంగా జగన్ నిర్ణయాలు, పథకాలు అమలు చేస్తూ ముందుకెళుతున్నారు. అసలు ఆయన భారీ మెజారిటీతో గెలిచి ఓ రికార్డు సృష్టించారు. తర్వాత ఎప్పుడు లేని విధంగా ఒకేసారి 25 మందితో మంత్రివర్గం ఏర్పాటు చేసుకుని, పాలన మొదలుపెట్టి సరికొత్త రికార్డు నెలకొల్పారు.

 

ఇక ఇక్కడ నుంచి చూసుకుంటే జగన్ తీసుకునే ప్రతి నిర్ణయం సంచలనమే. అమలు చేసే ప్రతి పథకం ఓ రికార్డే. ఉదాహరణకు పోలవరంతో సహ మిగిలిన ప్రాజెక్టుల్లో అవినీతి అరికట్టడానికి తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్, పి‌పి‌ఏలు పునఃసమీక్షించడం, ఇసుకలో అక్రమాలు నిలిపేయడానికి ఇసుక తవ్వకాలే ఆపేయడం, ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం, అమరావతిలో అక్రమాలు వెలికితీయడం, చివరికి దేశంలో లేని విధంగా మూడు రాజధానుల నిర్ణయంతో సంచలనం సృష్టించారు.

 

అటు పథకాలు అమలులో కూడా జగన్ సరికొత్త రికార్డులు నెలకొల్పారు. ఒకేసారి పెన్షన్ల పెంపు, రైతు భరోసా, ఆటో డ్రైవర్లకు సాయం, చేనేత, మత్స్యకారులకు సాయం, కాపు నేస్తం, జగనన్న గోరుముద్ద, వసతి దీవెన, విద్యాదీవెన, అమ్మఒడి ఇలా ప్రతి పథకం అమలు రికార్డే. అటు ప్రభుత్వానికి, ప్రజలకు వారథిలాగా గ్రామ/వార్డ్ వాలంటీర్, సచివాలయ వ్యవస్థలని తీసుకొచ్చారు.

 

ఇక ఇటీవలే పెన్షన్ లబ్దిదారుల ఇంటికే నేరుగా వెళ్ళి పెన్షన్లు అందించడం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ విధానం మొదలుపెట్టిన నెలలో వాలంటీర్లు కాస్త ఇబ్బంది పడిన, మార్చిలో మొత్తం దుమ్ములేపేశారు. 1వ తేదీన దాదాపు 60 లక్షల పంపిణీ చేయాల్సి ఉంటే, అదేరోజు మధ్యాహ్నం 2 గంటల్లోపే దాదాపు 47 లక్షల మందికి పెన్షన్లు అందించి సరికొత్త రికార్డు సృష్టించారు. ఊహించని విధంగా ఇలా పెన్షన్ డబ్బులు అందించడం వల్ల లబ్దిదారులు చాలా ఆనందంగా ఉన్నారు. ఏదేమైనా జగన్‌కే ఇలాంటివి సాధ్యమవుతాయని నిరూపించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: