ఒక 25 ఏళ్ల వివాహిత తన భర్త హోలీ పండుగ కి బట్టలు కొని ఇవ్వను అని చెప్పినందుకు ఆగ్రహానికి గురై తన ఆరు నెలల పాప ని కొట్టి చంపేసింది. ఈ సంఘటన శనివారం రోజు ఆగ్రాలోని ఆలీఘర్ ప్రాంతంలోని రంపాస్ గ్రామంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం సొంత కూతురిని చంపి నిందితురాలైన 25 ఏళ్ల పింకీ శర్మ ని పోలీసులు అరెస్టు చేశారు.




పోలీసులు చెప్పిన ప్రకారం... శనివారం సాయంత్రం పింకీ శర్మ తన భర్త రాహుల్ ని బట్టలు కొనివ్వమని అడిగింది. అయితే ఆ సమయంలో తనకి ఆరోగ్యం బాగా లేకపోవడంతో... షాపింగ్ మాల్ కి తిరిగే ఓపిక లేదని చెప్పి అతను పడుకున్నాడు. దీంతో నిరాశ చెందిన ఆమె భర్తపై మండిపడింది. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వారి తగాదా తార స్థాయికి చేరుకునేసరికి తీవ్ర ఆగ్రహానికి గురైన పింకీ శర్మ తన ఆరు నెలల పాప ని నేలకేసి కొట్టింది. దీంతో ఆ ఆరు నెలల పాప తల పగిలి అక్కడికక్కడే మరణించింది. దీంతో ఒక్కసారిగా నిర్ఘాంత పోయిన రాహుల్ పది నిమిషాల తర్వాత తేరుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆమెపై ఫిర్యాదు చేశాడు.



సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేసే విచారించగా...' మా ఆయన నా మధ్య ప్రతి రోజూ గొడవలు జరుగుతుంటాయి. ఇంట్లో సమస్యలతో నేను రోజు కృంగి పోతాను. ఈరోజు నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఆ క్షణంలో నేనేం చేస్తున్నానో నాకే తెలియలేదు. నా ఆరు నెలల పాప చనిపోదనుకున్నాను కానీ చనిపోయింది' అని ఏడ్చుకుంటూ చెప్పింది. జవాన్ పోలీస్ స్టేషన్ లో ఆమెపై IPC సెక్షన్ 302 కేసు నమోదయింది. రాహుల్ తో పింకీ కి వివాహమై నాలుగు సంవత్సరాలు గడవగా వాళ్ళిద్దరికీ 3 ఏళ్ల కుమారుడు రిషాబ్ ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: