రాజ‌కీయాల్లో అనుభ‌వం ఉండాలి.. స‌రే.. కానీ, దీనికి మించిన లౌక్యం ఉండాల‌ని నిరూపిస్తోంది.. తాజా ప‌రిణామం. తాను అను భ‌వ శూరుడిన‌ని ప‌దే ప‌దే చెప్పుకొనే చంద్ర‌బాబుకు లౌక్యంతో ముందుకు సాగుతున్న సీఎం జ‌గ‌న్‌కు ఇదే పెద్ద తేడా అంటున్నా రు మేధావులు. ఫార్టీ ఇయ‌ర్స్ అనుభ‌వం అంటూ.. త‌న‌క‌న్నా ఈ దేశ రాజ‌కీయాల్లో సీనియ‌ర్లు లేర‌ని చెప్పుకొనే చంద్ర‌బాబు ఎన్నిక‌ల్లో విఫ‌ల‌మ‌య్యారు. అదేస‌మ‌యంలో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ల‌డంలోనూ ఆయ‌న ఫెయిల‌య్యారు. ఈ ప‌రిణా మాల నుంచి పార్టీని బ‌లోపేతం చేసుకోవ‌డంలోను, నాయ‌కుల‌ను నిల‌బెట్టుకుని, త‌న‌వైపు తిప్పుకోవ‌డంలోను కూడా ఆయ‌న ఫెల‌వుతున్నారు. ఎన్నిక‌లు ముందు, అవి ముగిసిన త‌ర్వాత చంద్ర‌బాబు చేసిన, చేస్తున్న ఏ ప్ర‌య‌త్న‌మూ ప్ర‌జామోదం పొం ద‌లేక పోతోంది.



కానీ, అదేస‌మ‌యంలో.. కేంద్రంలోని బీజేపీ ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో త‌క్కువ సంఖ్య‌లో ఎంపీలు రావాల‌ని తాను దేవుడిని కోరుకున్నా న‌నంటూ.. ఢిల్లీలోనే వ్యాఖ్యానించిన జ‌గ‌న్‌.. లౌక్యంతో ముందుకు సాగుతున్నారు. ``ఇప్పుడు కేంద్రానికి చాలినంత సంఖ్య క‌న్నా ఎక్కువ‌గానే ఎంపీలు ఉన్నారు. ఈ స‌మ‌యంలో మ‌నం కేంద్రంపై పోరాటం చేయ‌డం వృధా. దీనిక‌న్నా ప్లీజ్‌.. ప్లీజ్‌.. అంటూ.. మ‌న ప‌ని మ‌నం చేసుకోవ‌డం ఉత్త‌మం``-అంటూ జగ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న గతంలో అనేక మంది నుంచి విమ‌ర్శ‌లకు గురైంది. అయితే, ఈ లౌక్య‌మే ఇప్పుడు ఆయ‌న‌కు కొండంత బ‌లంగా మారింది.



ఆయ‌న ఎప్ప‌డు కోరితే అప్పుడు కేంద్రంలోని పెద్ద‌లు అప్పాయింట్‌మెంట్ ఇస్తున్నారు. జ‌గ‌న్ చెబుతున్న వ‌న్నీ వింటున్నారు. ముఖ్యంగా ప్ర‌త్యేక హోదాపైనా జ‌గ‌న్ విడిచి పెట్ట‌కుండా వారిని కోరుతున్నారు. అదే స‌మ‌యంలో అస‌లు అవుతుందా? అవ‌దా? అని భావించిన  ఏపీ శాస‌న మండ‌లి ర‌ద్దు విష‌యంలోనూ సానుకూల సంకేతా లు వ‌చ్చాయి. కేంద్రం మండ‌లిర‌ద్దుకు ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. నిజానికి ఇవ‌న్నీ కూడా అనుభ‌వంతో కాకుండా లౌక్యంతో సాధించుకుంటున్నారు జ‌గ‌న్‌.



మ‌రి త‌న అనుభ‌వాన్ని అడ్డు పెట్టి కేంద్రం నుంచి ఏపీకి ఎలాంటి సాయం చేయించుకోలేక పోయిన చంద్ర‌బాబు కంటే కూడా లౌక్యంతో ముందుకు సాగుతూ.. తాను అనుకున్న‌వి సాధిస్తున్న జ‌గ‌న్ ఈ విష‌యంలో బెట‌ర్ అనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఏదేమైనా.. చంద్ర‌బాబు అనుభ‌వాన్ని ఎవరూ త‌ప్పుప‌ట్ట‌క‌పో యినా.. ఉప‌యోగం లేని అనుభ‌వం ముందు నిదాన‌మే అయినా.. సాగిల ప‌డినా.. లౌక్య‌మే ఉత్త‌మం అని అనిపిస్తోంది. మ‌రి బాబు ఏమంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: