గతంలో విశాఖలో  ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అప్పటి  తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అవమానించింది కాబట్టే .. ఆ పార్టీ  అధినేత చంద్రబాబు నాయుడుకు  విశాఖలో అవమానం జరిగిందా ? అంటే అవుననే రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నర్సింహారావు అంటున్నారు . అయితే చంద్రబాబు నాయుడుపై విశాఖ లో జరిగిన దాడిని ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజులు ఖండించగా , జివిఎల్ నర్సింహారావు మాత్రం దానికి భిన్నంగా స్పందించడం పట్ల ఆ పార్టీ శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి . చంద్రబాబు పై దాడిచేసింది ప్రజలు కాదని , ఈ తరహా చిల్లర పనుల ద్వారా విశాఖ పరువు తియోద్దంటూ పరోక్షంగా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను హెచ్చరించారు .

 

గతం లో జగన్మోహన్ రెడ్డి పైన  దాడి జరిగినా , ఇప్పుడు చంద్రబాబుపై దాడిజరిగిన  ఖండించాల్సిందిపోయి, గతం లో టీడీపీ ప్రభుత్వ హయాంలో జగన్ పై దాడి   జరిగింది కాబట్టి , ఇప్పుడు చంద్రబాబు పై దాడి చేయడం సబబే అన్నరీతిలో జివిఎల్ మాట్లాడిన తీరు చూసి, రాజకీయ పరిశీలకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు . జివిఎల్ తీరుపై రాష్ట్ర  బీజేపీ నాయకత్వం కూడా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతోంది . మూడు రాజధానులపై తమ వైఖరికి భిన్నంగా తరుచూ, జివిఎల్ చేస్తున్న ప్రకటనలు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపుతున్నాయన్న భావనలో కమలనాథులు ఉన్నారు .

 

అధికార పార్టీని టార్గెట్ చేయాల్సిన చోటి జివిఎల్ , ప్రతిపక్ష పార్టీని లక్ష్యంగా విమర్శలు చేస్తుండడం పై వారు లోలోన మండిపడుతున్నారు . జివిఎల్ వైఖరి చూసి ఆయన అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు . అయితే ఇందులో నిజ, నిజాలెలా ఉన్న చంద్రబాబు పై దాడిని ఖండించకుండా ,  దాన్ని సమర్ధించేలా మాట్లాడిన తీరు విమర్శలపాలవుతోంది . 

మరింత సమాచారం తెలుసుకోండి: