ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మిగతా వారిమాదిరిగా కులగజ్జి లేదని సినీనటుడు పోసాని కృష్ణమురళి అన్నారు . అమరావతి ఒకే  సామాజికవర్గం రాజధానిగా మారిందని  గతం లో పృథ్వీ చేసిన వ్యాఖ్యలు ఖండించిన తరువాత జగన్ తో మీకు గ్యాప్ పెరిగినట్లుందన్న ప్రశ్నకు పోసాని స్పందిస్తూ కొంతమంది మాదిరిగా  జగన్ కు కుల గజ్జి అస్సలు లేదని, తనకు ఆ విషయం తెలుసునని చెప్పారు . పృథ్వీలాంటి వాళ్ళు చేసే వ్యాఖ్యలతో జగన్ విశ్వసనీయత ఏమి కావాలని తాను స్పందించానంతేనని చెప్పుకొచ్చారు . జగన్ పై తాను అలగడం కానీ తనపై జగన్ అలగడం కానీ ఈ జన్మ కు జరగవని అన్నారు .

 

ఎన్నికల ముందు జగన్ కు ఒక్కసారి ఓటెయ్యమని తాను కోరానని , ఒక్కసారి ఓటేస్తే ఆయన పాలన చూసి పదేపదే ఓటేస్తారని ప్రజలకు  చెప్పానని వివరించారు . జగన్ ముఖ్యమంత్రి అయ్యారని , తన కోరిక నెరవేరిందన్న పోసాని ...  ఇప్పుడు కూడా తాను  జగన్ పక్కనే ఉండి ఏమి చేయాలని  ఎదురు ప్రశ్నించారు . తనకు పదవుల మీద వ్యామోహం లేదని , సేవ చేయడానికి సిద్ధమేనన్న పోసాని , కొన్ని నెలల క్రితమే తనను పదవి విషయం లో సంప్రదించారని చెప్పారు . తాను దానికి అంగీకరించలేదని అన్నారు . అయితే ఎస్వీబీసీ చైర్మన్ గా తొలుత పృథ్వీ ని నియమించి ,   పోసానిని జగన్ విస్మరించారన్న ఊహాగానాలు విన్పించాయి .

 

అందుకే గతం లో  అమరావతిపై పృథ్వీ చేసిన వ్యాఖ్యలపై పోసాని తీవ్ర స్థాయి లో విమర్శలు చేయడం వెనుక తనని కాదని పృథ్వీకి పదవి  కట్టబెట్టారన్న అక్కసుతోనే  ఆరోపణలు విన్పించాయి . అయితే అంతలోనే ఎస్వీబీసీ మహిళా ఉద్యోగిణితో అసభ్య ఫోన్ సంభాషణ కారణంగా   పృథ్వీ ని చైర్మన్ పదవి నుంచి తప్పించిన విషయం తెల్సిందే .   పృథ్వీ వ్యాఖ్యలపై గతంలోతాను ఎందుకు ఘాటుగా స్పందించానో   ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పోసాని వెల్లడించారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: