అప్పట్లో చంద్రబాబు పరిపాలన పై రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన సమయంలో ప్రతిపక్షంలో ఉన్న జగన్ సంచలన కరమైన వ్యాఖ్యలు చేసేవారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ రేట్లు ఒకలా ఉంటే పక్క రాష్ట్రాలలో రేట్లు మరోలా ఉన్నాయని ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకురావడానికి వైయస్ జగన్ అనేక ప్రయత్నాలు చేసే వాళ్ళు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని రేట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయి అంటూ తన మీడియాలో మరియు అదే విధంగా తన పార్టీ నాయకుల చేత చంద్రబాబు ప్రభుత్వం పై విమర్శలు చేయించేవారు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఒక నెల రోజుల్లోనే రెండుసార్లు పెట్రోల్ మరియు డీజిల్ రేట్లు పెరిగిపోవటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

 

అంతేకాకుండా ఇటీవల పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ పెంచుతూ,  జీవో జారీ చేయడం జరిగింది. లీటరు పెట్రోల్‌పై ఇప్పటి వరకు 31 శాతం వ్యాట్‌తోపాటు అదనంగా 2 రూపాయలు తీసుకునే వారు. ఇప్పుడు వ్యాట్‌+రూ.2.76 వసూలు చేసారు. అంటే, పెట్రోల్ పై 76 పైసలు పెంచారు. ఇక డీజిల్ పై, 22.25 వ్యాట్‌+రూ.2 గా ఉండగా, దాన్ని 22.25+3.07కు మార్చారు. అంటే, డీజిల్ రూ.1.07 పెంచారు. దీంతో టీడీపీ నేత కె ఇ కృష్ణ మూర్తి జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఒక నెలలోనే రెండు సార్లు ఈ విధంగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దేనికి నిదర్శనమని జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

 

గత నెలలోనే వ్యాట్‌లో సవరణలు చేసి రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి, అది మరవక ముందే మరోసారి పెట్రోల్ ధరలు పెంచడం సరికాదని ఆయన సూచించారు. ఈ విధంగా ధరలు పెంచుతూ ప్రజలపై భారం మోపడం దారుణమని జగన్ ప్రభుత్వాన్ని విమర్శించారు. కాగా ఇదే విషయంలో జగన్ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తున్నారు అని సూటిగా ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ టిడిపి డిమాండ్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: