తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్న తెలుగుదేశం పార్టీని గట్టెక్కించడం ఇప్పట్లో టిడిపి అధినేత చంద్రబాబుకు కష్టంగానే ఉంది. ఆయనకు వయస్సు మీదపడడంతో ఇబ్బందికరంగానే ఆయన ప్రజా ఉద్యమాలు చేస్తూ, పార్టీ జనాల్లో ఉనికిలో ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు. తాను విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులోనూ ఈ విధంగా బాబు కష్టపడుతున్నాడు. తన రాజకీయ వారసుడిగా నారా లోకేష్ ఉన్నా ఆయన పనితీరు అంతంత మాత్రమే అన్న సంగతి బాబుతో పాటు పార్టీ నాయకులకు కూడా తెలిసిన విషయమే కావడంతో ఆయనకు టిడిపి బరువు బాధ్యతలు అప్పగించేందుకు చంద్రబాబు ఇష్టపడడం లేదు. ఈ నేపథ్యంలోనే లోకేష్ భార్య నారా బ్రాహ్మణి పొలిటికల్ గా యాక్టివ్  చేసేందుకు చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే అధికారికంగా పార్టీ సభలు, సమావేశాలు, ప్రజా ఉద్యమాల్లో బ్రాహ్మణి పాల్గొనేలా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

IHG


 తాజాగా చంద్రబాబు నివాసంలో నారా బ్రాహ్మణి ఆధ్వర్యంలో సోషల్ మీడియా కార్యకర్తలతో ఓ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా పనితీరుపై ఆమె ఓ రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి సోషల్ మీడియాలో కాస్త బలం ఎక్కువగానే ఉంది. చంద్రబాబు చేస్తున్న ప్రజా ఉద్యమాలు, వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడంలోను సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంటోంది. తాజాగా విశాఖ లో పర్యటించిన చంద్రబాబు యాత్రను వైసిపి అడ్డుకునేందుకు ప్రయత్నించడం, దానికి టిడిపి సోషల్ మీడియా విభాగం గట్టిగా కౌంటర్లు ఇవ్వడం, దీని వల్ల పార్టీకి బలం చేకూరుతుందని టిడిపి నమ్ముతోంది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా లో మరింత యాక్టివ్ చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. 

IHG


 చంద్రబాబు సొంత నివాసంలో కొంతమంది సోషల్ మీడియా టీడీపీ యాక్టివిస్ట్ లను ఎంపిక చేసి వారికి విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిన్న స్థాయి వర్క్ షాప్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నారా బ్రాహ్మణి ఇచ్చినట్లు తెలుస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి మేలు జరిగేలా సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం నిర్వహించాలని సూచించినట్లు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వ వ్యతిరేకతను కూడా హైలెట్ చేసే విధంగా ఈ వర్క్ షాప్ లో నారా బ్రాహ్మణి టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ లకు పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే నారా బ్రాహ్మణి స్వయంగా ప్రజా ఉద్యమాలలో, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నట్టు తెలుస్తోంది .

మరింత సమాచారం తెలుసుకోండి: