శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు కలిసి మహారాష్ట్రలో అధికారాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.  అయితే, దేశవ్యాప్తంగా సిఏఏ విషయంలో అల్లర్లు జరుగుతున్న మహారాష్ట్ర సర్కార్ మాత్రం ఈ విషయంలో సైలెంట్ గా ఉన్నది.  కారణం ఏంటి అన్నది పక్కన పెడితే, ఇప్పటి వరకు ఆ విషయంపై ఎలాంటి అధికారిక వ్యాఖ్యలు చేయకపోవడం విశేషం.  


దీనికి అనేక కారణాలు ఉండొచ్చు.  31 ఏళ్లుగా శివసేన బీజేపీలు కలిసి పనిచేశాయి.  ఇప్పుడు అధికారం విషయంలో జరిగిన ఇబ్బందుల వలన విడిపోయాయి.  కానీ, భవిష్యత్తులో మరలా కలిసి పనిచేసే ఛాన్స్ లు ఉండొచ్చు.  అందులో సందేహం అవసరం లేదు.  అందుకే శివసేన పార్టీ సైలెంట్ గా ఉన్నది.  మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకి కాబట్టి సిఏఏ ను వ్యతిరేకిస్తోంది.  ఎందుకంటే మైనారిటీ ఓటు బ్యాంక్ ఆ పార్టీకి అవసరం.  


ఇక ఇదిలా ఉంటె మహారాష్ట్రలో కూటమిలో ఉన్న మూడో పార్టీ ఎన్సీపీ.  ఈ పార్టీ అధినేత శరత్ పవన్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినా తన స్టాండ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు.  శరద్ పవార్ కు మహారాష్ట్రలో మంచి పేరు ఉన్నది.  అయన పార్టీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే కూడా మెరుగ్గా రాణించింది.  అయితే, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు అజిత్ పవార్ మాత్రం కొంత దూకుడును ప్రదర్శిస్తున్నాడు. 


మహారాష్ట్రలో ఎన్సీపీని మొదట చీల్చాలని చూశాడు.  బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.  కానీ, తిరిగి శరత్ పవార్ గూటికి చేరిన అజిత్ పవార్ ఆ తరువాత కూడా బీజేపీ నేతలతో టచ్ లోనే ఉండటం విశేషం.  ఇప్పుడు సిఏఏ విషయంలో అజిత్ పవార్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.  సిఏఏ వలన ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని, మైనారిటీలకు కూడా ఇబ్బందులు ఉండవని చెప్పి పేర్కొన్నారు.  ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: