ఒక దెబ్బకు రెండు పిట్టలన్నది పాత నానుడి అయిపోయింది. ఇపుడంతా ఒక దెబ్బకు ఎన్ని వీలైతే అన్ని పిట్టలను రాలగొట్టేయటమే. ఇపుడు జరిగిందదే. జగన్మోహన్ రెడ్డి-ముఖేష్ అంబానీ భేటి దెబ్బకు చాలా పిట్టలే రాలిపోయినట్లు సమాచారం. జగన్ తో ముఖేష్ అవటాన్ని చాలామంది తట్టుకోలేకపోతున్నారు. ఇలా తట్టుకోలేకపోతున్నవారిలో  ప్రధముడు చంద్రబాబునాయుడు. తర్వాత పచ్చమీడియా అధిపతులు. ఆ తర్వాత టిడిపి నేతలు.

 

జగన్-ముఖేష్ భేటి విషయం బయటకు వచ్చిన దగ్గర నుండి వీళ్ళ బాధ ఒకటని చెప్పటం కష్టం. బయటపడకుండా లోపల్లోపలే కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నట్లున్నారు. ఆ విషయాలు వాళ్ళ మీడియాలోని కథనాలను బట్టే అంచనా వేసేయొచ్చు.  జగన్ దెబ్బకు రిలయన్స్ రాష్ట్రం నుండి పారిపోయింది, అదానీ, లూలూ వెళ్ళిపోయారంటూ చంద్రబాబు, టిడిపి నేతలతో పాటు పచ్చమీడియా కూడా ఎంత యాడీ చేస్తోందో అందరూ చూస్తున్నదే.

 

అయితే జగన్, ముఖేష్ భేటితో వీళ్ళ నోళ్ళకు తాళాలు పడిపోయినట్లే అనుకోవాలి. ఎందుకంటే జగన్ ను ముఖేష్  కలిసింది వ్యక్తిగత ప్రయోజనం కోసమే అయినా భేటిలో రాష్ట్ర ప్రయోజనాలు కూడా చర్చకు వచ్చుంటాయి కదా.  పెట్టుబడులు పెట్టటం, వ్యాపార విస్తరణ లేకపోతే కొత్తగా సెజ్ ఏర్పాటు చేసి రిలయన్స్ భూములు ఇవ్వటం లాంటి అనేక అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. వీటిల్లో ఏ ఒక్కటి వాస్తవంలోకి వచ్చినా చంద్రబాబు, పచ్చమీడియా నోళ్ళు ఇక లేవదన్నది వాస్తవం.

 

అమరావతి ప్రాంతంలో ఉన్న వేలాది ఎకరాల్లో సెజ్ ఏర్పాటు చేసి అందులో రిలయన్స్ కు ప్రభుత్వం భూములు కేటాయిస్తే అప్పుడు రైతులు కూడా మాట్లాడరు. ఎందుకంటే రిలయన్స్ కు వ్యతిరేకంగా చంద్రబాబు మాట్లాడలేడు. చంద్రబాబు నోరు మూత పడిపోతుంది కాబట్టి పచ్చమీడియా కూడా జగన్ పై బురద చల్లే అవకాశం లేదు. చంద్రబాబు, పచ్చమీడియా నోళ్ళు పడిపోతాయి కాబట్టి రైతులుండరు, ఉద్యమమూ ఉండదు. అంటే ఇపుడర్ధమైందే జగన్-ముఖేష్ భేటి దెబ్బకు ఎన్ని పిట్టలు రాలిపోతాయో ?

మరింత సమాచారం తెలుసుకోండి: