స్ధానికి సంస్ధల ఎన్నికలకు ముందు పార్టీలోని యూత్, వారసులు నారా లోకేష్ కు హఠాత్తుగా గుర్తుకొచ్చారు. మొన్నటి వరకూ పార్టీ భవిష్యత్తును తానొక్కడే భుజాన మోస్తున్నంతగా బిల్డప్ ఇచ్చాడు అధికారంలో ఉన్నంత కాలం చినబాబు. తీరా ఎన్నికలొచ్చాక తెలిసింది తన భుజంపై ఏమీ లేదని. అందుకనే పార్టీకి ఘోర పరాజయం ఎందురైంది. అంతేకాకుండా తాను పోటి చేసిన మంగళగిరి నియోజకవర్గంలో కూడా ఘోరంగా ఓడిపోయాడు. దాంతో తత్వం బోధపడినట్లుంది అందుకనే అర్జంటుగా పార్టీలోని యువ నేతలతో విందు సమావేశం నిర్వహించాడు. ఈ పాటికే అర్ధమైపోయుంటుంది  ఇదంతా చంద్రబాబునాయుడు పుత్రరత్నం  నారా లోకేష్ గురించే అని.

 

అవును ఆదివారం లోకేష్ దంపతులు పార్టీలోని కొందరు యువనేతలకు విందు ఇచ్చారు. యువనేతలంటే మళ్ళీ అందరూ కాదులేండి. పార్టీలోని ప్రముఖుల వారసుల్లో కొందరిని అంటే ఓ 35 మందిని వాళ్ళ భార్యలతో కలిసి విందుకు రమ్మంటు ఆహ్వానించారు. నిజానికి ఇటువంటి సమావేశం మొన్నటి ఎన్నికలకు ముందు జరిగుండాల్సింది. అప్పుడేమో తనకు ఎక్కడ పోటి వస్తారో అన్నట్లుగా చాలామందిని లోకేష్ దూరంగా పెట్టాడు.

 

ఎందుకంటే అప్పటికే వాళ్ళల్లో చాలామంది లోకేష్ కన్నా బెటర్ అని అనిపించుకున్నారు. దాంతో మొన్నటి ఎన్నికల్లో వారసత్వ హోదాలో పోటి చేయటానికి చాలామంది ప్రయత్నించారు. కానీ వాళ్ళకు టికెట్లివ్వటంలో లోకేష్ అడ్డుపడినట్లు పార్టీలో ఆరోపణలున్నాయి. పరిటాల సునీత, జేసి సోదరులు చంద్రబాబును దాదాపుగా బ్లాక్ మెయిల్ చేసి తమ వారసులకు టికెట్లు ఇప్పించుకున్నారు. సరే పోటి చేసిన వారందరూ ఓడిపోయారు లేండి. అలాంటిది వాళ్ళందరినీ యాక్టివ్ గా పనిచేయాలంటూ చెప్పటానికి ఇపుడు విందు రాజకీయం మొదలుపెట్టాడు.

 

మరి తొందరలో జరగబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో వారసులకు టికెట్లిచ్చే విషయంపై చంద్రబాబు కానీ  లోకేష్ కానీ హామీ ఇవ్వలేదని సమాచారం. యువతను ప్రోత్సహించటమే లక్ష్యమైతే జిల్లా పరిషత్ లు, మున్సిపల్ ఛైర్మన్ , కార్పొరేషన్ మేయర్ పోస్టులన్నీ యువతకే రిజర్వు చేస్తే వాళ్ళల్లో నాయకత్వంపై నమ్మకం ఏర్పడుతుంది. లేకపోతే యూజ్ అండ్ త్రో పాలసీలోనే ఉంటే పార్టీ కోసం ఎవరు పనిచేస్తారు ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: