కరోనా వైరస్ రోజు రోజుకు తన పంజా విసురుతోంది.  ఇప్పటికే ప్రపంచవ్యాపంగా దాదాపుగా 3000 వేల మందికి పైగా మరణించారు.  ఇంకా దీనిబారిన పడిన వ్యక్తులు కోకొల్లలు.  మొన్నటి వరకు చైనాకు పరిమితమైన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచంలోని 66 దేశాలకు పాకింది.  ఇలా ఈ వైరస్ ప్రపంచంలోని 66 దేశాలకు పాకడంతో ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు.  


చైనా తరువాత అత్యధికంగా కరోనా కేసులు నమోదైన దేశం కొరియా.  అక్కడ 4212 కేసులు నమోదుకాగా, మృతుల సంఖ్య 22కు పెరిగింది.  ఇప్పుడు ఆ దేశాన్ని మాస్కుల కొరత ఇబ్బందులు పెడుతున్నది.  మాస్కుల కొరత కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఇక ఇదిలా ఉంటె, కొరియా తరువాత అత్యధిక కేసులు ఇటలీలో నమోదయ్యాయి.  


అక్కడ 1577 కేసులు నమోదు కాగా మరణాల సంఖ్యా 34 కు చేరింది.  ఇదిలా ఉంటె,కరోనా ఎఫెక్ట్ ఇప్పుడు వాటికన్ సిటీని తాకింది.  రోమ్ నగరం కూడా ఈ కరోనా బారిన పడటంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  రోమ్ నగరంలో ప్రస్తుతం పోప్ పర్యటిస్తున్నారు.  అయన గత కొన్ని రోజులుగా తీవ్రమైన దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు.  


కొన్నాళ్ల క్రిందట శ్వాససంబంధమైన ఇబ్బందుల కారణంగా ఊపిరి తిత్తుల్లోని కొంతభాగాన్ని ఆపరేషన్ ద్వారా తొలగించారు.  కాగా, ఇప్పుడు అయన జలుబు, దగ్గు వలన బాధపడుతుండటంతో అధికారికంగా అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు.  బయట జరిగే కార్యక్రమాలకు పోప్ హాజరు కాబోరని ప్రకటన వెలువడింది.  ఎక్కడ ఉన్నా సరే ప్రజలు కోసం అక్కడి నుంచే ప్రార్థిస్తానని అంటున్నారు పోప్.   ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ వైరస్ దెబ్బకు కుదేలైంది.  అటు అమెరికాలో కూడా కరోనా కేసులు నమోదవుతున్నాయి.  న్యూయార్క్ నగరంలో మొదటికేసు నమోదైంది.  అమెరికాలో కరోనా వలన మరణించిన వారిసంఖ్య రెండుకు చేరింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: