నిర్భయ దోషులకు పాటియాలా కోర్ట్ ఇప్పటి వరకు మూడుసార్లు డెత్ వారెంట్ రిలీజ్ చేసింది.  రేపటి రోజున నిర్భయ కేసులో నలుగురు దోషులకు తీహాడ్ జైల్లో ఉరితీయాల్సి ఉన్నది.  పవన్ గుప్తా ఉరిశిక్షను యావజీవ శిక్షగా మార్చాలని కోరుతూ కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.  అయితే, ఈ పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టేసింది.  అయితే, పవన్ గుప్తా ఇంకా రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ ను దాఖలు చేయాల్సి ఉన్నది.  కాబట్టి ఆ క్షమాభిక్ష పిటిషన్ పై రాష్ట్రపతి నుంచి తిరిగి వచ్చే వరకు ఉరి ఆపాలని కోరుతూ పాటియాలా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

 
దీంతో రేపు నలుగురిని ఉరి తీస్తారా లేదా అన్నది సందేహంగా మారింది.  యధావిధిగా తీహాడ్ జైలు అధికారులు రేపటి ఉరికి అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. పాటియాలా కోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉన్నది కాబట్టి ఉరి ఆగే అవకాశం ఉండొచ్చు.  ఒకవేళ ఇదే జరిగితే మూడుసార్లు డెత్ వారెంట్ నుంచి తప్పించుకున్నట్టు అవుతుంది.  


రాష్ట్రపతి క్షమాభిక్ష తరువాత నలుగురికి మరొక అవకాశం ఉండదు కాబట్టి అప్పుడైనా తప్పించుకోలేరు.  ఇప్పుడు కాకపోతే మరో పదిరోజుల తరువాత అయినా సరే వీరిని ఉరి తీయడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.  కాకపోతే ఆలస్యం అవుతుంది అంతే.  పిటిషన్ తరపు న్యాయవాది ఎలాగైనా వారిని ఉరి నుంచి తప్పించాలని చూస్తున్నారు. దీని వలన కోర్టుకు సమయం వృధా చేస్తున్నారని , న్యాయవాది ఉద్దేశ్యపూర్వకంగా దోషులను తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ధర్మాసనం అభిప్రాయం పడొచ్చు.  


అయితే, పాటియాలా కోర్టులో ప్రస్తుతం పిటిషన్ పెండింగ్ లో ఉన్నది కాబట్టి ఉరి ఆలస్యం అవుతుందని అంటున్నారు.  కానీ,కోర్టు ఇందుకు అంగీకరిస్తుందా అన్నది చూడాలి.  ఒకవేళ పాటియాలా కోర్టు పిటిషన్ ను కొట్టేసి ఉరి తీసేందుకు అనుమతి ఇస్తే రేపు తెల్లారే సరికి నలుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.  నిర్భయ ఆత్మకు శాంతి లభిస్తుంది.  ఈ నలుగురి కోసం ఇప్పటికే ప్రభుత్వం లక్షలాది రూపాయలు ఖర్చు చేసింది.  ఇప్పటికైనా వారిని ఉరి తీస్తే ప్రభుత్వానికి ఆ డబ్బు ఆదా అవుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: