తెలుగుదేశంపార్టీ కూన రవి అరెస్టయ్యాడు. నోటికొచ్చినట్లు అధికారులను మాట్లాడుతు రెగ్యులర్ గా వివాదాల్లో ఇరుక్కుంటున్న రవిని మొత్తానికి పోలీసులు అరెస్టు చేశారు. మొన్నటి ఎన్నికల్లో అధికారంలో నుండి దిగిపోయిన తర్వాత చాలామంది నేతలు జగన్మోహన్ రెడ్డిపై బాగా మండిపోతున్నారు. రవిపై మొత్తం నాలుగు సెక్షన్ల క్రింద పోలీసులు కేసు నమోదు చేయటం సంచలనంగా మారింది.

 

తాజాగా ఓ ప్రభుత్వ ఉద్యోగికి కూన ఫోన్ చేసి నోటికొచ్చినట్లు మాట్లాడాడు. మామూలుగా కూడా రవి వ్యవహారం ఎలాగుంటుందంటే ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే బూతులు తిట్టటం అలావాటే. పైగా తన పనులు చేయించుకోవటానికి అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తారనే ఆరోపణలు కూడా బాగా ఉన్నాయి. గతంలో కూడా ఓ ఎంపిడివో ని నోటికొచ్చినట్లు మాట్లాడిన వ్యవహారంలో కేసులు నమోదై అరెస్టు దాకా వ్యవహారం వెళ్ళింది.

 

ఎప్పుడైతే పోలీసులు అరెస్టు చేయటానికి వచ్చారో వెంటనే  ఇల్లు, ఆఫీసు నుండి పారిపోయాడు. మొత్తానికి ఎక్కడ వెతికినా దాదాపు నెల రోజుల పాటు మాయమైపోయిన విషయం అందరికీ తెలిసిందే.  చివరకు కోర్టులో లొంగిపోయి బెయిల్ తీసుకున్నాడు. మళ్ళీ ఇపుడు మరో అధికారిని నోటికొచ్చినట్లు బూతులు తిట్టడం సంచలనంగా మారింది. అంటే రవి వ్యవహారమే ఇలాగుంటుందన్నది తేలిపోయింది.

 

ఇక్కడ సమస్య ఏమిటంటే మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీతో పాటు తాము కూడా ఓడిపోయామని, తామిప్పుడు ప్రతిపక్షంలో ఉన్నామన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకనే వైసిపి అధికారంలో ఉన్నా ఇంకా తామే అధికారంలో ఉన్నట్లు చాలా మంది ఫీలైపోతున్నారు. చంద్రబాబునాయుడు దగ్గర నుండి క్రిందస్ధాయి నేతల వరకూ ఇదే వరస. అందుకనే ప్రభుత్వ యంత్రాంగాన్ని నోటికొచ్చినట్లు మాట్లాడుతు, తిడుతు ప్రతిరోజు వ్యవహారాల్లో ఇరుక్కుంటున్నారు.  మరి రవి తాజా అరెస్టుతో అయినా మిగిలిన నోటిదురుసు నేతలకు బుద్ధి వస్తుందో రాదో చూడాల్సిందే. ఒకవైపు చంద్రబాబే వాళ్ళని ప్రోత్సహిస్తుంటే నేతలు మాత్రం ఊరకే ఎందుకుంటారు చెప్పండి ?

మరింత సమాచారం తెలుసుకోండి: