కల్తీ నూనెపై ఎన్నో వార్తలు వింటూనే ఉన్నప్పటికీ అనేక కల్తీ నూనె వ్యాపారస్తులు వ్యాపారం చేస్తూనే ఉన్నారు. కానీ ఈ వార్త  దారుణం. ఇలా తయారు చేసిన నూనె వాడితే ఇంకేమైనా ఉందా? వామ్మో..నిజంగా  ప్రాణానికి ఎంతో ప్రమాదం. అయితే  ఈ నూనె ఎలా చేస్తున్నారు అంటే...జంతువుల కళేబరాలతో. ఇలా చేస్తున్న ముఠాని అరెస్ట్ చేసారు పోలీసులు. 

 

ఈ విషయం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలో చోటు చేసుకుంది. ఈ ముఠా జంతువుల కళేబరాలతో నూనెని తయారు చేసి అమ్ముతోంది. ఇలా తయారు చేసిన నూనె వాడితే ఇంకేమైనా ఉందా? నిజంగా  ప్రాణానికి ఎంతో ప్రమాదం. ఈ వ్యాపారం తిమ్మాపూర్ పంచాయతీ, రైల్వే స్టేషన్ సమీపంలో హరి ఫీల్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో కొందరి వ్యాపారాలు చేస్తున్న ఈ దారుణాన్ని పసిగట్టారు పోలీసులు.

 

రెవెన్యూ అధికారులు, పోలీసులు. స్థానికుల సమాచారం అందుకుని వారు క్షుణ్ణంగా పరిశీలించారు. అందులో ఈ ముఠా గుట్టు రట్టయింది. వీరు చేస్తున్న వ్యాపారం తెలిసిపోయింది. ఈ పరిశ్రమలో పని చేస్తున్న కొందరు వ్యాపారస్తులు ఇంత దారుణంగా నూనెని తయారు చేయడం నిజంగా దారుణం. ఇంతకీ తనిఖీ నుండి తేలినది ఏమిటంటే? చనిపోయిన పందులు తీసుకుని వాటి కళేబరాలతో నూనె తయారు చేస్తునట్టు ఈ విచారణలో తేలింది.

 

ఈ విషయంపై రెవిన్యూ అధికారులు, పోలీసులు కూడా పూర్తిగా తనిఖీ చేసారు. ఈ వ్యాపారం చేస్తున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు వారిని విచారిస్తున్నారు పోలీసులు. ఇలా ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కంపెనీ చేస్తున్న ఈ వ్యాపారాన్ని కొనసాగించకూడదని ఈ కంపెనీని సీజ్ చేసేసారు. ఇలా నూనె తయారు  చెయ్యడం ఎంతో  ప్రమాదం జనానికి, అందుకే సీజ్ చేసి విచారిస్తున్నారు పోలీసులు ఆ ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని.

మరింత సమాచారం తెలుసుకోండి: