ఏపీ తెలుగుదేశం పార్టీలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటం, పార్టీ ఉనికిపై నాయకులకు నమ్మకం కొరవడడం, భవిష్యత్తులోనూ చంద్రబాబు తర్వాత ఆ పార్టీని ముందుకు నడిపించే సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం, ఇదే సమయంలో అధికార పార్టీ వైసీపీ ప్రజల్లోకి బలంగా దూసుకెళ్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు, నిర్ణయాలతో ప్రజలకు మరింత దగ్గరవడం ఇవన్నీ ఏపీ టీడీపీ ని కలవర పరుస్తున్నాయి. టిడిపి జాతీయ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు పార్టీని ఇప్పటి వరకు తన భుజాలపై సమర్థవంతంగా మోసుకొచ్చారు. 

IHG


ఇప్పటికిప్పుడు చంద్రబాబు రాజకీయాలకు దూరం కాకపోయినా...  మరి కొద్ది నెలల్లో ఆయన వయసు రీత్యా ఆ బాధ్యతల నుండి తప్పుకునే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు రాజకీయ వారసులు ఎవరు అనేది చర్చకు వస్తోంది. లోకేష్ కు రాజకీయంగా అంత పట్టు లేకపోవడం, పార్టీలోనూ, ప్రజల్లోనూ ఆయన నాయకత్వంపై నమ్మకం లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి అందరికి కనిపిస్తోంది. కేవలం నారా వారి కోడలుగానే కాక నందమూరి వారసురాలిగా కూడా తన తాత స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఇప్పుడు నారా బ్రాహ్మణి తీసుకునేందుకు సిద్ధమవుతోంది. నందమూరి బాలకృష్ణ ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉన్నారు. 

IHG


నందమూరి వారసురాలిగా తన తండ్రి వారసత్వాన్ని, తాత వారసత్వాన్ని అలాగే నారావారి కోడలిగా ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు బ్రాహ్మణి తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించేందుకు సిద్దమవుతుండటంతో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది. ఇక బ్రాహ్మణి కూడా క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చేందుకు చాలాకాలం నుంచి వేచి చూస్తున్నారు. నారా.. నందమూరి కుటుంబాల రాజకీయ అనుభవం, నేపథ్యం తనకు అన్ని విధాలా కలిసి వస్తుందని, భవిష్యత్తులోనూ చంద్రబాబు కు ధీటుగా తాను పార్టీని ముందుకు నడిపించగల అనే ధీమా బ్రాహ్మణిలో కనిపిస్తుంది. 

IHG


అంతేకాకుండా నందమూరి వారసులకు దక్కాల్సిన టిడిపి కీలక బాధ్యతలు చంద్రబాబు అన్యాయంగా చేజిక్కించుకున్నారు అనే అపవాదు నుంచి బయట పడేలా నందమూరి వారసురాలు నారా బ్రాహ్మణి ఇప్పుడు పార్టీ బాధ్యతలు చేపడితే తనమీద ఎప్పటి నుంచో ఉన్న అపవాదు కూడా తొలగిపోతుందనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. మరికొద్ది రోజుల్లోనే నారా బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ పై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: