ఈశాన్య దిల్లీలోని ఖజూరీ ఖాస్ ప్రాంతంలో నివసించే అంకిత్ శర్మ ఫిబ్రవరి 25న విధుల నుంచి వస్తూ కనిపించకుండా పోయారు.  తర్వాత రోజు ఆయన మృతదేహం చాంద్‌బాగ్ కల్వర్ట్ దగ్గరున్న మురుగు కాలువలో ఉన్నట్టు కాలనీ వారి ద్వారా కుటుంబ సభ్యులకు తెలిసింది. అయితే ఢిల్లీలో జరిగిన అల్లర్ల కారణంగా దుండగులు అంకిత్ శర్మను అత్యంత దారుణంగా హతమార్చారు. ఢిల్లీ అల్లర్లలో కనీవిని ఎరుగని స్థాయిలో విధ్వంసం అయింది. జరిగిన విధ్వంసం చూస్తుంటే ఒంట్లో వణుకు పుడుతోంది. ఆందోళనకారులు సాగించిన ఉన్మాద చర్యలు అందర్నీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి.

 

ఇళ్లను, షాపుల్నే కాదు ఆఖరికి అందమైన స్కూళ్లను అంధవికారంగా మార్చేశారు.  ప్రస్తుతం ఢిల్లీలో క్రమంగా పరిస్థితి మెరుగుపడుతోంది. పోలీసు బలగాల పహారాతో జనం రోడ్ల మీదకు వస్తున్నారు. మూకల దాడిలో ముస్తఫాబాద్‌, బ్రిజ్‌పురి, శివవిహార్‌లో పదుల సంఖ్యలో స్కూళ్లు ధ్వంసమయ్యాయి. ఈశాన్య ఢిల్లీలో సీఏఏకు అనుకూలంగా, వ్యతిరేకంగా చెలరేగిన ఘర్షణల్లో దారుణ హత్యకు గురైన ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ) ఆఫీసర్‌ అంకిత్‌ శర్మ(26) దుండగులు పాశవికంగా చంపారు.  అంకిత్ శర్మ శరీరంపై 400కు పైగా కత్తిపోట్లు పొడిచి చంపేశారు.

 

ఆ తర్వాత శర్మ మృతదేహాన్ని డ్రైనేజీలో పడేశారు. గంటల తరబడి శర్మను ఓ ఆరుగురు వ్యక్తులు చిత్ర హింసలకు గురి చేసి ఉంటారని ఫోరెన్సిక్ నివేదికలో పేర్కొన్నారు. ఇక తమ కుమారుడిని హతమార్చినవారిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు పోరాటం చేస్తున్నారు.  తాజాగా  అంకిత్‌ శర్మ కుటుంబానికి రూ. కోటి నష్ట పరిహారం ప్రకటించారు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌. శర్మ కుటుంబంలో అర్హులైన వారికొకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని సీఎం కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఢిల్లీ అల్లర్లలో దాదాపు 47 మంది మరణించారని అంటున్నారు.  కానీ స్థానికులు మాత్రం ఈ లెక్క ఎక్కువే అంటున్నారు.  అయితే ఢిల్లీలో కొనసాగుతున్న అల్లర్ల విషయంపై పార్టీ నేతలు ఒకరిపై ఒకరు దూషించుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: